మీరు ఈ పథకంలో ఏడాదికి కనీసం రూ. 10,000 నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రీమియం చెల్లింపులు నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక విధానాల్లో ఎంచుకోవచ్చు.
రోజుకు రూ. 50 పెట్టుబడి పెడితే:
ఉదాహరణకు మీరు 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ పథకంలో చేరారని అనుకుందాం. మీరు నెలకు రూ. 1515 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ. 50 జమ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీరు మెచ్యూరిటీ సమయానికి రూ. 35 లక్షలు పొందొచ్చు.