వర్క్ టైమింగ్స్ మార్చండి బాబోయ్: పనివేళల్లో ఇబ్బందుల వల్ల ఉద్యోగుల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు

Published : May 28, 2025, 07:28 PM IST

మీ ఆఫీస్ వర్క్ టైమింగ్స్ మీకు సౌకర్యవంతంగానే ఉన్నాయా? కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? ఇలాంటి ఆసక్తికర విషయాలపై ఓ కంపెనీ నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అవేంటో తెలుసుకుందామా?

PREV
15
సర్వేలో షాకింగ్ విషయాలు

ఉద్యోగుల వర్క్ టైమింగ్స్ పై ఓ కంపెనీ సర్వే నిర్వహించింది. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కొంతమంది కంపెనీ తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వడం లేదని బాధపడ్డారు. కంపెనీ డెవలప్ మెంట్ కోసం ఎంత కష్టపడుతున్నా తగిన సాలరీలు ఇవ్వడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది రకరకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అవేంటంటే..

25
52 శాతం మంది ఆవేదన

వర్క్ టైమింగ్స్ సౌకర్యంగా లేకపోవడం వల్ల వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నామని 52 శాతం మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానసిక వేదనతో ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోతున్నామని తెలిపారు. మొత్తం సర్వేలో కేవలం 25 శాతం మంది మాత్రమే పని గంటలు బాగానే ఉన్నాయని తెలిపారు. 

35
మానసికంగా కుంగిపోతున్నాం..

ఉద్యోగ విధుల్లో భాగంగా వర్క్ టైమింగ్ ఎక్కువైపోయిందని కొందరు బాధ పడుతుంటే, ఆఫీసు నుంచి ఇంటికొచ్చి కూడా పని చేయాల్సి వస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఇంటి పనులు చేయలేక, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేక మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నామని వెల్లడించారు. 

45
మాకు వర్క్ ఫ్రం హోం కావాలి..

ఇంటి దగ్గర ఉండి పనిచేసే అవకాశం ఉన్నా తమ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడం లేదని 37 శాతం మంది బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే మాకు వర్క్ ఫ్రం హోం వద్దు కాని.. టైమింగ్ సరిగ్గా ఫిక్స్ చేస్తే చాలని 46 శాతం మంది కోరుతున్నారు. ఫిక్స్‌డ్ టైమ్ లో అయినంత వర్క్ చేసి వెళ్లిపోతామని, మిగిలిన వర్క్ మర్నాడు వచ్చి చేస్తామని, ఇంటి దగ్గర పూర్తి చేయమని యాజమాన్యాలు కోరవద్దని అడుగుతున్నారు.

55
ఉద్యోగుల ఆరోగ్యాన్ని కంపెనీలు చూసుకోవాలి

వర్క్ ప్రెషర్ పెరిగిపోయి మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నామని 78 శాతం మంది ఉద్యోగులు ఈ సర్వేలో వెల్లడించారు. తమ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కంపెనీలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రత్యేకంగా అకేషన్స్ నిర్వహించి తమ కుటుంబాలను కూడా అందులో పాల్గొనేలా చేయాలని కోరుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories