ఈ కాలంలో ప్రతి కుటుంబానికి కారు కంపల్సరీ అయిపోయింది. చిన్నదో, పెద్దదో ప్రతి ఇంటి ముందు కారు ఉంటోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చీప్ అండ్ బెస్ట్ కార్లు కొనేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో టాప్ 5 లో ఉన్న కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మారుతి సుజుకి ఆల్టో K10
ధర: రూ.4.23 లక్షల నుండి రూ.6.21 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). నగరాన్ని బట్టి ధరలో కాస్త మార్పు ఉంటుంది.
ఇంజిన్: 1.0 లీటర్ K-Series పెట్రోల్, 67 bhp పవర్, 89 Nm టార్క్.
CNG వేరియంట్‌లో 56 bhp పవర్, 82 Nm టార్క్.
ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT.
ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్స్, 7-ఇంచ్ టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ESP, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు.