ఉద్యోగం లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? రూపాయి పెట్టుబ‌డి లేకుండా వేల‌ల్లో సంపాదించే అవ‌కాశం..

Published : Aug 28, 2025, 03:09 PM IST

అనుకున్న ఉద్యోగం రాక చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే వ్యాపారం చేద్దాం అంటే పెట్టుబ‌డి ఉండ‌దు. మ‌రి ఎలాంటి పెట్టుబ‌డి లేకుండా కేవ‌లం మ‌న నాలెడ్జ్‌తో డ‌బ్బులు సంపాదించే మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
ఆన్‌లైన్ ట్యూటరింగ్

ఇంట్లో కూర్చొని, మీకున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించడం ఆన్‌లైన్ ట్యూటరింగ్. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు – మీ నైపుణ్యాన్ని డబ్బుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు: గణితం, ఇంగ్లీష్, సైన్స్, కంప్యూటర్స్ వంటి సబ్జెక్టుల్లో బోధించవచ్చు. దీంతో డ‌బ్బులు కూడా ఆర్జించ‌వ‌చ్చు.

DID YOU KNOW ?
ఆదాయం ఎలా వస్తుంది?
ఆన్‌లైన్ ట్యూటరింగ్ బిజినెస్‌లో ఆదాయం పూర్తిగా విద్యార్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
25
పెట్టుబడి అవసరం ఎంత?

ఇందుకు పెద్ద‌గా పెట్టుబ‌డితో ప‌ని ఉండ‌దు. మ‌రీ ముఖ్యంగా మీ ద‌గ్గ‌ర ల్యాప్‌టాప్ లేదా కంప్యూట‌ర్ ఉంటే రూపాయి కూడా అవ‌స‌రం లేదు. కేవ‌లం ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉంటే స‌రిపోతుంది. సాఫ్ట్‌వేర్, వీడియో కాలింగ్ టూల్స్ (Zoom, Google Meet) వంటివి ఉంటే స‌రిపోతుంది. ఇవి కూడా ఉచితంగానే ల‌భిస్తాయి. అయితే ఒక‌వేళ మీరు మార్కెటింగ్ చేసుకోవాలంటే ప్ర‌క‌ట‌నల కోసం కొంత ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

35
ఆదాయం ఎలా వస్తుంది?

ఆన్‌లైన్ ట్యూటరింగ్ బిజినెస్‌లో ఆదాయం పూర్తిగా విద్యార్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక గంట బోధనకు రూ. 300 నుంచి రూ. 1000 వ‌ర‌కు తీసుకోవ‌చ్చు. ఇలా రోజుకు 3–4 గంటలు బోధిస్తే నెలకు త‌క్కువ‌లో త‌క్కువ రూ. 25 వేలు సంపాదించ‌వ‌చ్చు. దీన్ని మరింత విస్తరించి, ఆన్‌లైన్ కోర్సులు రూపొందించి విక్రయిస్తే స్థిరమైన ఆదాయం వస్తుంది. ఇక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌ల‌తో కూడా డ‌బ్బులు ఆర్జించ‌వ‌చ్చు.

45
పెరుగుతోన్న డిమాండ్

ఈరోజుల్లో చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఆన్‌లైన్ ట్యూటర్లను ఎక్కువగా వెతుకుతున్నారు. అందుకే ఈ రంగంలో డిమాండ్ పెరుగుతూనే ఉంది.

55
ఎలా ప్రారంభించాలి?

* మీ నైపుణ్యం ఎంచుకోండి: మీరు బాగా బోధించగల సబ్జెక్టును ఎంపిక చేసుకోండి.

* ప్లాట్‌ఫామ్ ఎంచుకోండి: Chegg, TutorMe, UrbanPro వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో నమోదు చేయండి లేదా మీ సొంత వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి.

* మార్కెటింగ్ చేయండి: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మీ క్లాసుల గురించి ప్రచారం చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories