ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. మీరు ఇంకా దాఖలు చేయకపోతే, మీరు కొన్ని ప్రయోజనాలను కోల్పోతారు.
ప్రతి ఒక్కరూ ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. అది మీ ఆదాయ రుజువుగా పనిచేస్తుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ దరఖాస్తు అయినా, బ్యాంకులు, NBFCలు దీన్ని పరిగణిస్తాయి. మీరు క్రమం తప్పకుండా ఐటీఆర్ దాఖలు చేస్తే లోన్ త్వరగా వస్తుంది. లేకపోతే కొన్ని బ్యాంకులు ఇచ్చేందుకు ఇష్టపడవు.
25
విదేశీ యాత్ర, వీసా దరఖాస్తు సులువు
మీరు విదేశీ యాత్ర లేదా చదువు కోసం వీసా తీసుకోవాలనుకుంటే, గత 3-5 సంవత్సరాల ఐటీఆర్ రికార్డ్ అడిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ప్రతి ఏడాది ఐటీఆర్ దాఖలు చేయడం మాత్రం మరిచిపోవద్దు.
35
పన్ను వాపసు పొందండి
మీ జీతం లేదా ఆదాయంపై TDS కట్ అయితే దీన్ని వాపసు పొందడానికి ఐటీఆర్ దాఖలు చేయడం అవసరం. ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మీ అసెస్‌మెంట్ చేస్తుంది. మీకు రావాల్సిన డబ్బును తిరిగి ఇస్తుంది.
మీరు షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి నష్టపోతే… దాన్ని తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆర్ధిక నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంది.
55
భారీ బీమా కవర్‌కు అవసరం
ఇప్పుడు బీమా కంపెనీలు పెద్ద టర్మ్ ప్లాన్‌లు తీసుకునేవారి నుండి వారి ఐటీఆర్ రసీదును అడుగుతున్నాయి. వారు ఐటీఆర్ ద్వారా మీ ఆదాయ వనరులు, వాటి క్రమబద్ధతను తనిఖీ చేస్తారు. అలా మీకు భారీ బీమాను అందిస్తాయి.