జియో సూపర్ ప్లాన్.. కేవలం రూ.91కే 28 రోజుల వ్యాలిడిటీ

Published : Aug 28, 2025, 11:05 AM IST

Jio Plan: రిలియన్స్ జియో సంచలన ఆఫర్ లను తీసుకవచ్చింది. తన వినియోగదారులకు చౌక ధరలోనే సూపర్ ప్లాన్లను అందిస్తోంది. జియో అందిస్తున్న చౌక ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

PREV
15
జియో సంచలన ఆఫర్లు

Jio Plan: ఈ రోజుల్లో చాలామంది ఎక్కువ డేటా లభించే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రాధాన్యం ఇస్తున్నారు. BSNL, Jio, Airtel, Vodafone Idea వంటి టెలికాం కంపెనీలు విభిన్న రీచార్జ్ ఆప్షన్లను అందిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ ఉన్నవారికి కూడా రూ.100 లేదా అంతకంటే తక్కువ ధరల ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఇలాంటి సందర్భాల్లో రిలియన్స్ జియో సంచలన ఆఫర్ లను తీసుకవచ్చింది. తన వినియోగదారులకు చౌక ధరలోనే సూపర్ ప్లాన్లను అందిస్తోంది. కేవలం రూ.100లతో 90 రోజుల చెల్లుబాటు అందిస్తుంది. వినియోగదారులకు డేటా ప్రయోజనాలను అందించే డేటా ప్లాన్ గురించి తెలుసుకుందాం..

25
రూ.100తో 90ల వ్యాలిడిటీ

జియో రూ. 100 ప్లాన్ తో 5GB డేటా బెనిఫిట్‌ పొందవచ్చు. వినియోగదారులు 90 రోజుల పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందవచ్చు. 5G కనెక్టివిటీ ప్రాంతాల్లో ఉండే వినియోగదారులు అపరిమిత 5G డేటాను అందుకోవచ్చు. 

అంతేకాకుండా, డేటా అయిపోయిన తర్వాత కూడా, మీరు తక్కువ వేగంతో ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అలాగే.. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 5GB డేటాతో పాటు JioHotstar OTT ఉచిత సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

35
రూ.91 రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో మరో సరికొత్త ప్లాన్లను అందిస్తోంది. రూ.91 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 100 MB డేటా, 200 MB బోనస్ డేటా, 50 SMS,అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. మొత్తం 3GB డేటా తర్వాత నెట్ స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది. జియోఫోన్, జియోఫోన్ ప్రైమ్ సభ్యులు జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాలను ఉచితంగా పొందగలరు.

45
జియోఫోన్ ప్రత్యేక రీచార్జీలు..

జియోఫోన్, జియోఫోన్ ప్రైమ్ వినియోగదారులకు ప్రత్యేక రీచార్జీలు. రూ.91 ప్లాన్ కేవలం జియోఫోన్, జియోఫోన్ ప్రైమ్ సభ్యులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా జియో క్లౌడ్ స్టోరేజ్, జియో టీవీకి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. 

రూ.91 ప్లాన్‌తో పాటు రూ.75 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీని వ్యాలిడిటీ 23 రోజులూ ఉంటుంది. ప్రతిరోజూ 0.1 GB హై స్పీడ్ డేటా, 200 MB బోనస్ డేటా, 50 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ కూడా అందుతుంది.

55
ఇతర రీఛార్జ్ ప్లాన్స్

జియో మరోవైపు రూ.125, రూ.152, రూ.186, రూ.223, రూ.895 ప్లాన్లను కూడా అందిస్తుంది. ప్రత్యేకంగా రూ.895 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్‌లు తక్కువ ధరలో డేటా, కాలింగ్, ఇతర లాభాలు కోరుకునే జియోఫోన్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories