Oil prices Down: దేశంలో భారీగా త‌గ్గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.?

Published : Aug 08, 2025, 12:35 PM ISTUpdated : Aug 08, 2025, 02:07 PM IST

ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల‌ను నిలిపివేయాల‌ని భార‌త్‌ను అమెరికా హెచ్చ‌రిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 50 శాతం సుంకాలను విధిస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రష్యా తీసుకున్న ఓ నిర్ణయం భారత్‌కు క‌లిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. 

PREV
15
ర‌ష్యా బంప‌రాఫ‌ర్

అమెరికా నుంచి వస్తున్న ఆర్థిక ఒత్తిళ్లు, ఐరోపా ఆంక్షల మధ్యలో రష్యా భారత్‌కు చమురు డిస్కౌంట్‌ను మరింత పెంచుతోంది. తాజా డేటా ప్రకారం, రష్యా ఉరల్స్‌ గ్రేడ్‌ క్రూడ్ ఆయిల్‌ ధరలు డేటెడ్‌ బ్రెంట్‌ ఆయిల్‌తో పోలిస్తే సుమారు 5 డాలర్ల వరకు తక్కువగా ఉన్నాయి. రెండు వారల కిందట ఇవి సమాన స్థాయిలో ఉండగా, ప్రస్తుతం తేడా మరింత పెరిగింది. ఇది భారత ఆయిల్ కంపెనీలకు ఆర్థికంగా లాభదాయకమయ్యే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

DID YOU KNOW ?
ఎంత దిగుమ‌తి చేసుకుంటున్నామంటే.?
ఇప్పుడు భారత్‌లో రష్యా ఆయిల్ వాటా 37% దాకా ఉంది. వాస్తవంగా డిస్కౌంట్ పెరగడం, అధిక సరఫరా, కేంద్రం పన్ను తగ్గిస్తేనే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి.
25
ర‌ష్యా నుంచి కొనుగోల్లు త‌గ్గుతున్నాయా.?

ఇదిలా ఉంటే అమెరికా ప్రకటించిన ఆంక్షల కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు రష్యా చమురును కొనుగోలు చేయ‌డానికి వెనుక‌డుగు వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అభిప్రాయాలు వ‌స్తున్నాయి. దీంతో రష్యా చమురుకు ఉన్న డిమాండ్‌లో కొంత తగ్గుదల కనిపిస్తుంది. ఇది రానున్న రోజుల్లో ఇంధ‌న ధరల పతనానికి దారి తీస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

35
పెర‌గ‌నున్న స‌ర‌ఫ‌రా కూడా ఒక కార‌ణం

కాగా అగస్ట్‌ నుంచి అక్టోబర్‌ మధ్యకాలంలో రష్యాలోని ఆయిల్ శుద్ధి కేంద్రాలలో నిర్వహణ పనులు జరుగనున్నాయి. ఈ కార‌ణంగానే ర‌ష్యా నుంచి తక్కువ సమయంలో ఎక్కువ చమురును మార్కెట్‌కు పంపే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల సరఫరా పెరిగి ధరలు మరింత తగ్గే అవకాశముంది. ఈ అంశాన్ని డేటా సంస్థ Kpler‌ విశ్లేషకుడు హుమయూన్ ఫాలాక్షాహి ప్ర‌స్తావించారు.

45
ప్రైవేటు కంపెనీలు మాత్రం

ప్ర‌స్తుతం భార‌త్ దిగుమ‌తి చేసుకుంటున్న ఇంధ‌నంలో ర‌ష్యా వాటా సుమారు 37 శాతంగా ఉంది. అయితే ర‌ష్యా మీద ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గిస్తే.. మిగతా దేశాల నుంచి మరింత ఖరీదైన చమురును కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో చ‌మురు ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. అయితే ప్రభుత్వ రంగ కంపెనీలు ఒకింత వెనక్కి తగ్గినా, ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు మాత్రం ఇప్పటికీ రష్యా నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో, అమెరికా నుంచి చమురు దిగుమతులు మే నెలనాటికి రోజుకు 2.25 లక్షల బ్యారెళ్లకు పెరిగినట్లు సమాచారం. ఇది సంవత్సర ప్రారంభంతో పోలిస్తే రెట్టింపు కావ‌డం గ‌మ‌నార్హం.

55
పెట్రోల్, డీజిల్ ధరలు త‌గ్గుతాయా.?

రష్యా చమురుపై డిస్కౌంట్లు పెరగడం, మార్కెట్‌లో అధిక సరఫరా ఉండటం భారత ప్రభుత్వానికి ఓ అవకాశాన్ని అందించొచ్చు. ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఈ చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తే, అందులో కొంత ప్రయోజనాన్ని వినియోగదారులకూ బదిలీ చేయొచ్చు. అయితే ఈ ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరాలంటే కేంద్ర ప్రభుత్వం పన్ను భారం తగ్గించాల్సి ఉంటుంది. లేకపోతే, అంతర్జాతీయ ధరలు తగ్గినా దేశీయంగా పెట్రోల్-డీజిల్ ధరల్లో పెద్ద మార్పు కనిపించదు. కాబ‌ట్టి పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌లు త‌గ్గ‌డం అనేది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories