Saving Scheme: రూ. 70 ల‌క్ష‌లు సంపాదించాలా.? నెల‌కు రూ. 12,500 పొదుపు చేస్తే చాలు

Published : Aug 07, 2025, 02:48 PM IST

ప్ర‌స్తుతం చాలా మందిలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పెరుగుతోంది. డ‌బ్బు సంపాదించ‌డంలో ఉన్న శ్ర‌ద్ధ‌ను పొదుపు చేయ‌డంలో కూడా చూపిస్తున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఎన్నో ప‌థ‌కాలు తీసుకొచ్చింది. అలాంటి ఓ ప‌థ‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
కుమార్తెకు భద్రమైన భవిష్యత్

పిల్లల భవిష్యత్తు కోసం ముందుగానే ఆర్థికంగా ఏర్పాట్లు చేయడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా కుమార్తెలు పెద్దయ్యే సమయంలో వారి చదువు, వివాహం వంటి ముఖ్యమైన జీవిత అంశాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఉన్న‌త చ‌దువు లేదా వివాహం ఇలా దేనికైనా డబ్బు అవసరం అవుతుంది. అటువంటి అవసరాలకు ముందుగానే నిధిని సమకూర్చే మార్గాల్లో పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధి యోజన (SSY) ముందు వరుసలో ఉంటుంది.

DID YOU KNOW ?
వ‌డ్డీపై ప‌న్ను ఉండ‌దు
సుకన్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కంలో నిశ్చిత‌మైన ఆదాయం ల‌భించ‌డ‌మే కాకుండా.. ఇందులో వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది.
25
సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి?

ఇది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒక ప్రత్యేక పొదుపు పథకం. ఈ పథకాన్ని ఆడ బిడ్డ‌ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ స్కీమ్ కింద, 10 ఏళ్లు లోపు ఉన్న కుమార్తె పేరిట ఖాతా తెరవవచ్చు. ఒక్కో సంవత్సరం కనీసంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. పొదుపుతో పాటు భద్రత కూడా ఉండే ఈ పథకానికి ప్రభుత్వం హామీ ఉంటుంది.

35
నెల‌కు రూ. 12,500 పొదుపు చేస్తే

మీరు మీ కుమార్తెకు 5 ఏళ్ల వయస్సులో ఖాతా తెరిచి, వరుసగా 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షలు (అంటే నెలకు ₹12,500) జమ చేశార‌ని అనుకుందాం. ఇలా 15 ఏళ్లలో మొత్తం పెట్టుబడి రూ. 22.5 లక్షలు అవుతుంది. ఇది చక్రవడ్డీ పద్ధతిలో పెరుగుతూ, 21 సంవత్సరాల తర్వాత దాదాపు రూ. 69.27 లక్షల రూపాయలుగా మారుతుంది. అంటే సుమారు రూ. 70 ల‌క్ష‌లు పొందొచ్చ‌న్న‌మాట‌. ఇందులో రూ. 46.77 లక్షలు వడ్డీ రూపంలో లభిస్తుంది.

45
పన్ను మినహాయింపు

ఈ పథకం ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా, నిశ్చితమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా ఇందులో వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఒక గొప్ప ప్రయోజనం. ప్రస్తుతం ఈ పథకం 8.2% వడ్డీ రేటుతో అందుబాటులో ఉంది. ఇది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర పొదుపు పథకాల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తోంది.

55
ముందుగా విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం కూడా

ఈ ఖాతా మెచ్యూరిటీ కాలం కుమార్తె 21 ఏళ్లు నిండిన తర్వాత ముగుస్తుంది. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాత, విద్యా అవసరాల కోసం పాక్షిక విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఆడ‌బిడ్డ‌ల విద్య‌కు ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. తద్వారా, చదువుల సమయంలో తల్లిదండ్రులకు ఆర్థికంగా ఒత్తిడి లేకుండా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories