సోలార్‌తో అనుసంధానం.. రూపాయి ఖర్చు లేని వంట
ఈ వ్యవస్థను మీ ఇంటి పైన ఉన్న సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్‌కు అనుసంధానించవచ్చు. దీనివల్ల గ్రిడ్ విద్యుత్ అవసరం లేకుండానే పూర్తిగా ఉచితంగా వంట చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో గృహ వినియోగదారులకే కాకుండా హోటళ్లు, కమర్షియల్ కిచెన్లకు కూడా ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ప్రస్తుతం మార్కెట్లోకి సింగిల్ బర్నర్, డబుల్ బర్నర్ వేరియంట్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
హైడ్రోజన్ కుక్‌టాప్ ధర ఎంత?
సాంకేతికత కొత్తది కావడంతో ప్రారంభంలో దీని ధర కాస్త ఎక్కువగా ఉంది.
• సింగిల్ బర్నర్ హైడ్రోజన్ స్టవ్: రూ. 1,05,000 + GST
• డబుల్ బర్నర్ హైడ్రోజన్ స్టవ్: రూ. 1,50,000 + GST
ప్రస్తుతానికి ధర భారంగా అనిపించినా, దీర్ఘకాలంలో ఎల్పీజీ సిలిండర్ల ఖర్చును, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.