Business Ideas: వేసవిలో డిమాండ్ ఉన్న టాప్ 3 బిజినెస్‌లు ఇవే.. రోజుకు రూ. 5 వేలు లాభం.!

Published : Apr 07, 2026, 07:39 PM IST

Business Ideas: సమ్మర్ సీజన్‌లో కేవలం రూ. 15 వేల నుంచి రూ. 20 వేల పెట్టుబడితో జ్యూస్ సెంటర్ ప్రారంభించి నెలకు రూ. 60 వేల వరకు లాభం పొందవచ్చు. అలాగే కొబ్బరి బొండాల వ్యాపారం ద్వారా రోజుకు.. 

PREV
15
వేసవిలో కాసుల వర్షం

ఎండలు ముదురుతున్న కొద్దీ చల్లని పానీయాలకు, ఆహార పదార్థాలకు గిరాకీ విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, తక్కువ పెట్టుబడితోనే సామాన్యులు కూడా భారీ లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా వేసవి మూడు నెలల్లో సుమారు 10 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉన్న మూడు ప్రధాన వ్యాపారాల ఇవి.

25
జ్యూస్ సెంటర్ వ్యాపారం

కేవలం రూ. 15 వేల నుంచి రూ. 20 వేలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనికి ప్రధానంగా కావాల్సింది ఒక మంచి జ్యూస్ మిక్సర్, దీని ధర సుమారు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు ఉంటుంది. రోజుకు 100 గ్లాసుల జ్యూస్ అమ్మినా, నెలకు ఖర్చులు పోను సుమారు రూ. 60 వేల నికర లాభం పొందవచ్చు. హోమ్ డెలివరీ సౌకర్యం కల్పిస్తే లాభాలు మరింత పెరుగుతాయి.

35
కొబ్బరి బొండాల వ్యాపారం

ఇది ఏడాది పొడవునా సాగే వ్యాపారమే అయినా, ఎండాకాలంలో దీనికి ఉండే డిమాండ్ వేరు. ఒక్కో బొండాన్ని 20-30 రూపాయలకు కొని, 50-60 రూపాయలకు అమ్మడం ద్వారా భారీ లాభం లభిస్తుంది. రోజుకు 100 బొండాలు అమ్మినా, నెలకు సుమారు రూ. 90 వేల వరకు సంపాదించవచ్చు. ఆరోగ్యకరమైన పానీయం కావడంతో ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు.

45
ఐస్ క్యూబ్స్ తయారీ బిజినెస్

జ్యూస్ స్టాల్స్, బార్లు, ఆసుపత్రులలో ఐస్ క్యూబ్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రూ. 30 వేల నుంచి రూ. 40 వేలతో ఐస్ క్యూబ్ మేకింగ్ మిషన్‌ను కొనుగోలు చేసి ఇంటి వద్దే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. ఒక కిలో ఐస్ క్యూబ్స్ తయారీకి 5 రూపాయలు ఖర్చయితే, మార్కెట్లో దాని ధర 15 రూపాయల వరకు ఉంటుంది. అంటే ప్రతి కిలోపై 10 రూపాయల లాభం ఉంటుంది. రోజుకు 100 ప్యాకెట్లు సేల్ చేసినా నెలకు కనీసం రూ. 30 వేలు సంపాదించవచ్చు.

55
పెద్దగా అనుభవం అవసరం లేదు

ఈ వ్యాపారాలకు పెద్దగా అనుభవం అవసరం లేదు. సరైన ప్రదేశాన్ని ఎంచుకుని, నాణ్యత పాటిస్తే ఈ సమ్మర్ సీజన్‌లో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories