ఈ ఆదాయాలను దేశంలోని అత్యున్నత పదవులతో పోలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ (IAS) నెలకు దాదాపు ₹5,00,000 వేతనం అందుకుంటారు. ఉన్నత స్థాయి ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ అధికారుల జీతం సుమారు ₹3,00,000 మాత్రమే. అలాగే ప్రభుత్వ స్పెషలిస్ట్ డాక్టర్లు ₹5,00,000, చీఫ్ ఇంజనీర్లు ₹2,50,000, చార్టర్డ్ అకౌంటెంట్లు ₹2,00,000 వరకు సంపాదిస్తారు. కానీ, ఇన్ స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ముస్కాన్ కారియా వంటి వారు బ్రాండ్ కొలాబరేషన్లు, ప్రమోషన్ల ద్వారా నెలకు ₹14,00,000 వరకు గడిస్తున్నట్లు సమాచారం.