ATM రూల్స్ చేంజ్.. ఈ బ్యాంక్ ఏటిఎంలో డబ్బులు తీసుకుంటే ఛార్జీల మోతే

Published : Mar 21, 2026, 04:53 PM IST

ఏప్రిల్ 1, 2026 నుంచి ఏటీఎం నిబంధనలు మారుతున్నాయి... దీనివల్ల వినియోగదారులకు లాభమా, నష్టమా..? ఈ మార్పులతో మీ జేబుకు చిల్లు పడుతుందా? అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? 

PREV
16
మీరు ఏటీఎం ఎక్కువగా వాడతారా..?
ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలోని పలు పెద్ద బ్యాంకులు ఏటీఎం వినియోగ నిబంధనలను మార్చబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. ఈ మార్పులు నేరుగా మీ జేబుపై ప్రభావం చూపొచ్చు. మీరు తరచుగా ఏటీఎం వాడుతుంటే, ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.
26
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్స్ కు బిగ్ షాక్
ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) కీలక మార్పు చేసింది. ఇకపై ఏటీఎంలలో యూపీఐ ద్వారా చేసే క్యాష్ విత్‌డ్రాయల్స్‌ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కిందనే లెక్కిస్తారు. అంటే, మీరు యూపీఐ ద్వారా ఎక్కువసార్లు డబ్బు తీస్తే, మీ ఫ్రీ లిమిట్ త్వరగా అయిపోతుంది.
36
ఇక ట్రాన్సాక్షన్‌ ఛార్జెస్..
నెలవారీ ఉచిత లావాదేవీల లిమిట్ దాటితే, ఆ తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.23 ఛార్జీ చెల్లించాలి. దీనికి పన్నులు అదనం. ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3, నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి.
46
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూల్స్ చేంజ్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ డెబిట్ కార్డ్ యూజర్ల కోసం విత్‌డ్రాయల్ లిమిట్‌ను మార్చింది. ఇకపై కస్టమర్లు తమ కార్డును బట్టి రోజుకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు మాత్రమే క్యాష్ తీసుకోగలరు. గతంలో కొన్ని కార్డులపై ఈ లిమిట్ రూ.1 లక్ష వరకు ఉండేది. భద్రత, రిస్క్ మేనేజ్‌మెంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.
56
డిజిటల్ బ్యాంకింగ్ లో మరో ముందడుగు..
జియో పేమెంట్స్ బ్యాంక్ (Jio Payments Bank) ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా క్యాష్ తీసుకోవచ్చు. దీనికి ఏటీఎం అవసరం లేదు. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, యూపీఐ యాప్‌లో పేమెంట్ కన్ఫర్మ్ చేస్తే చాలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్ మీకు క్యాష్ ఇస్తారు. ఇది డిజిటల్ బ్యాంకింగ్‌లో ఒక ముందడుగు.
66
ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..

ఈ కొత్త నిబంధనల ప్రభావం నేరుగా కస్టమర్ల జేబుపై పడొచ్చు. మీరు ఏటీఎం నుంచి తరచుగా డబ్బులు తీస్తున్నా, లేదా యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్స్ ఎక్కువగా చేస్తున్నా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. అందుకే, మీ బ్యాంక్ లిమిట్స్, రూల్స్ తెలుసుకుని లావాదేవీలు చేయడం మంచిది.

  • నెలలో ఎన్నిసార్లు క్యాష్ తీస్తున్నారో గమనించుకోండి. 
  • ఉచిత లావాదేవీల లిమిట్‌ను సరిగ్గా వాడుకోండి. 
  • యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్స్‌ను కూడా లిమిట్‌లో లెక్కిస్తారని గుర్తుంచుకోండి.
  • అవసరమైతేనే ఏటీఎం వాడండి.
Read more Photos on
click me!

Recommended Stories