Business Idea: మీకు 100 గ‌జాల భూమి ఉందా.? ఈ సాగుతో డబ్బులే డబ్బులు..

Published : Aug 04, 2025, 10:28 AM IST

Moringa Business: ప్ర‌స్తుతం అన్ని రంగాల్లో ఏఐ టెక్నాల‌జీ వినియోగం పెరిగిపోతోంది. అయితే ఒక్క వ్య‌వ‌సాయ రంగంపై మాత్రం ఏ టెక్నాల‌జీ ఎలాంటి ప్ర‌భావం చూప‌ద‌ని చెప్పాలి. అందుకే వినూత్న సాగును చేప‌డుతూ వేలల్లో ఆదాయం పొందొచ్చు.

PREV
15
మునగాకు సాగు

పోషకాహార లోపాలను నివారించడానికి మునగాకు అత్యంత ప్రయోజనకరమైనది. ఈ ఆకులో విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు సమృద్ధిగా కలిగి ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రధాన స్థానం పొందాయి. పట్టణాల్లో కూడా ఈ ఆకులపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి పెరటిలోనూ, పొలాల్లోనూ చిన్న స్థాయిలో మునగాకు సాగు ప్రారంభించవచ్చు. మున‌గాకు పంట ఎలా వేయాలి.? లాభాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యాల‌ను తెలుగు రైతుబ‌డి యూట్యూబ్ ఛాన‌ల్‌లో వివ‌రించారు. ఈ వీడియో చూడ్డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

DID YOU KNOW ?
ఎన్ని లాభాలో
మున‌గాకుల్లో ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ C, అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం, పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పోషకాలు ఉన్న మొక్కల్లో ఇది ఒక‌టిగా చెబుతారు.
25
మునగాకు ప్రాముఖ్యత, డిమాండ్

మునగాకు పొడి, పచ్చడి, సూప్, చాయ్‌ల రూపంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. పోషకాహార లోపాలతో బాధపడుతున్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు ఇది మంచి సహజ ఔషధం. పట్టణాల్లో ఆరోగ్య చైతన్యం పెరగడంతో మార్కెట్‌లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

35
సాగు చేయడానికి అవసరమైన స్థలం, విధానం

ఈ సాగును క‌నీసం 100 గజాలున్నా మొద‌లు పెట్టొచ్చు. రెండు అడుగుల లోతు మట్టి తవ్వి, కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువుతో 1:1 నిష్పత్తిలో కలపాలి. మడిని నాలుగు భాగాలుగా విభజించి విత్తనాలు నాటాలి. విత్తనాలపై గడ్డి పరచి తేమను ఉంచాలి. పశువుల నుంచి రక్షణ కల్పించాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ద్వారా 5-6 వారాల్లో మొక్కలు కోతకు సిద్ధమవుతాయి. కత్తిరించిన తర్వాత 50-60 రోజుల్లో మళ్లీ చిగురిస్తాయి.

45
ఎంత పెట్టుబ‌డి పెట్టాలి.?

విత్తనాలు, ఎరువులు, మట్టి తవ్వకం, నీటిపారుదల కోసం సుమారు రూ. 1500 నుంచి రూ. 2000 వ‌ర‌కు అవ‌స‌ర‌మ‌వుతాయి. అదే పెద్ద ఎత్తున అంటే సుమారు ఒక ఎక‌రంలో సాగు చేస్తే దాదాపు రూ. 30 వేల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. ప్రధానంగా ఖర్చు మొదటి సారి మాత్రమే ఉంటుంది; మొక్కలు మళ్లీ మళ్లీ చిగురుతుండటంతో తరువాతి సీజన్లలో ఖర్చు తక్కువగా ఉంటుంది.

55
లాభాలు ఎలా ఉంటాయి.?

ఒక చిన్న మడిలో మూడో కోత వరకు సుమారు 80-90 కిలోల తాజా మునగాకు లభిస్తుంది. పొడిగా మార్చి అమ్మితే ధర మరింత పెరుగుతుంది. కిలో పొడి ధ‌ర సుమారు రూ. 300 నుంచి రూ. 400 వ‌ర‌కు ఉంటుంది. ఎకరా స్థాయిలో సాగు చేస్తే సంవత్సరానికి ఏడాదికి రూ. ల‌క్ష‌ల్లో ఆదాయం పొందొచ్చు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, హెల్త్ స్టోర్లు వంటి వాటిలో విక్ర‌యించ‌వ‌చ్చు.

మున‌గాకుతో లాభాలు ఏంటి.?

మునగాకు రక్తహీనత, ఎముకల బలహీనత, రోగనిరోధక శక్తి లోపం వంటి సమస్యలకు సహజ వైద్యంగా ఉపయోగపడుతుంది. పరిశోధనలు సైతం ఈ విషయాన్ని ధృవీక‌రించాయి. మునగ ఉత్పత్తులపై గ్లోబల్ మార్కెట్ డిమాండ్ కూడా పెరుగుతోంది. చిన్న స్థలంలో సాగు చేసి కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు అదనంగా ఆదాయం కూడా సంపాదించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories