Spam call: స్పామ్ కాల్స్ తో విసిగిపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే శాశ్వత పరిష్కారం!

Published : Aug 04, 2025, 10:16 AM IST

Spam Calls Block: స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్ లు సమస్యను పరిష్కరించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రయత్నిస్తుంది. జియో, విఐ, ఎయిర్‌టెల్‌లలో టెలిమార్కెటింగ్ కాల్‌లు, స్పామ్ SMS లను శాశ్వతంగా బ్లాక్ చేయడం ఎలా ?

PREV
15
స్పామ్ కాల్స్ తో విసిగిపోతున్నారా

Spam Calls Block: మనం ఏదో పనిలో చాలా బిజీ బిజీగా ఉంటాం. అంతలో సడెన్‌గా ఏదో కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. మనం ఏదో ఎమర్జెన్సీ కాల్ అని లిప్ట్ చేస్తే.. మీకు లోన్ కావాలా? క్రెడిట్ కార్డు తీసుకుంటారా? తక్కువ వడ్డీ రేటుకే లోన్ ఇస్తామంటూ.. ఇలా ఏదేదో చెప్పి విసిగిస్తారు. అలాంటి కాల్స్ తో మన  ఆలోచనలు మొత్తం పోతుంది. నిత్యం ఇలాంటి ప్రమోషనల్, మార్కెటింగ్ కాల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మంది వీటిని ఎలా ఆపాలో తెలియక. వాటిని బ్లాక్ చేస్తారు. అయినా ఆ వేరే నంబర్ల నుంచి కాల్స్ చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని కట్టడి చేసే అవకాశం ఉంది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.

25
నేషనల్ ‘డు నాట్ కాల్’

స్పామ్ కాల్స్ నుంచి బయటపడాలనుకునే వారికి అందుబాటులో ఉన్న సులభమైన, అధికారిక పరిష్కారం నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR). దీన్ని గతంలో నేషనల్ 'డు నాట్ కాల్' రిజిస్ట్రీ (NDNC)గా పిలిచేవారు. ఈ సర్వీస్ ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అందిస్తుంది. ఇందులో మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా, టెలిమార్కెటింగ్ సంస్థల నుండి వచ్చే అవాంఛిత ప్రకటనల కాల్స్‌, మెసేజ్‌లను పూర్తిగా నియంత్రించవచ్చు. ఈ ప్రక్రియ వల్ల, బ్యాంకులు, షాపింగ్ సర్వీసులు, ఇన్సూరెన్స్, ట్రావెల్ ఏజెన్సీలు లాంటి విభిన్న వాణిజ్య సంస్థల నుంచి వచ్చే స్పామ్ కాల్స్‌ లేదా ప్రమోషనల్ మెసేజ్‌లకు చెక్ పడుతుంది. ఇది పైగా ఫ్రీ సర్వీస్. మీరు ఒకసారి NCPRలో రిజిస్టర్ అయితే, 7 రోజుల్లోపు ఈ సర్వీస్ యాక్టివ్ అవుతుంది. దీని వల్ల ముఖ్యమైన వ్యక్తిగత లేదా అధికారిక కాల్స్‌ మిస్ కాకుండా, అవాంఛిత స్పామ్ కాల్స్‌కి దూరంగా ఉండవచ్చు.

35
DND సర్వీస్‌ను యాక్టివేట్ చేయండిలా

స్పామ్ కాల్స్‌కి చెక్ పెట్టాలనుకుంటున్నారా? అయితే, DND (Do Not Disturb) సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోండి. దీనికి ప్రాసెస్ చాలా ఈజీ. ముందుగా మీ ఫోన్‌లో SMS యాప్ ఓపెన్ చేసి “START” అని టైప్ చేసి 1909 అనే నంబర్‌కు పంపండి. కొద్దిసేపటిలో మీకు టెలికాం సంస్థ నుంచి కొన్ని వర్గాల జాబితా వస్తుంది. ఇందులో బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్, ట్రావెల్ లాంటి విభాగాలు ఉంటాయి. మీరు వర్గం కాల్స్ ను బ్లాక్ చేయాలనుకుంటున్నారో.. దానికి సంబంధించిన కోడ్స్ ఎంచుకుని తిరిగి అదే నంబర్‌కు SMS పంపాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక 24 గంటలలోపు DND సర్వీస్ యాక్టివ్ అవుతుంది. ప్రత్యేకత ఏమిటంటే.. బ్యాంకులు, హాస్పిటాలిటీ సంస్థల నుంచి మాత్రమే కాల్స్/మెసేజ్‌లు రాగా, స్పామ్, మార్కెటింగ్, లేదా మోసపూరిత (సైబర్ స్కామ్) కాల్స్‌ మొత్తం బ్లాక్ అవుతాయి.

45
నెట్‌వర్క్ ప్రొవైడర్ వారిగా..

మీరు ఉపయోగిస్తున్న టెలికాం నెట్‌వర్క్‌ను బట్టి DND (Do Not Disturb) సర్వీస్ ను నేరుగా యాక్టివేట్ చేసుకునే వీలుంది. ప్రతి సర్వీస్ ప్రొవైడర్‌కి ప్రత్యేకమైన విధానం ఉంది.

Jio  : మీరు MyJio యాప్ లో సెట్టింగ్‌లు > సర్వీస్ సెట్టింగ్‌లు > డూ నాట్ డిస్టర్బ్ లోకి వెళ్లండి. ఇప్పుడు ఏ నెంబర్ బ్లాక్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి.

Airtel  : మీరు airtel.in/airtel-dndని సందర్శించి, అందులో మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే.. OTP వస్తుంది. వెంటనే ఓటీపీ నమోదు చేయాలి. తరువాత మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న నెంబర్ ను సెలక్ట్ చేయండి.

Vodafone Idea (Vi)  : https://www.myvi.in/dnd సైట్ లోకి వెళ్లండి. ఇక్కడ మీ వివరాలను నమోదు చేసి, బ్లాక్ చేయాల్సిన నెంబర్స్ ను ఎంచుకోండి.

BSNL  : మీ BSNL నంబర్ నుండి 1909 కు 'start dnd' అని మెసేజ్ చేయండి. ఆపై మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న నెంబర్ ను సెలక్ట్ చేయండి

55
మాన్యువల్‌గా నెంబర్లను బ్లాక్ చేయడం ఎలా?

ప్రతి స్పామ్ కాల్‌ అనేది మార్కెటింగ్ కాల్‌ అయి ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియని వ్యక్తుల నుండి కూడా తరచుగా డిస్ట్రబ్ చేసే కాల్స్ రావచ్చు. ఆ కాల్స్ తో విసిగిపోతుంటారు. అలాంటి కాల్స్ ను మ్యానువల్ గా బ్లాక్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే.. ముందు మీ Call History ఓపెన్ చేయండి. అక్కడ మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న నెంబర్‌పై టాప్ చేసి కాస్త సేపు పట్టుకోండి. ఆ వెంటనే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘Block’ లేదా ‘Report as Spam’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీకు తెలుసా? 

 “TRAI డేటా ప్రకారం: 2024లో 1.2 బిలియన్లకు పైగా స్పామ్ కాల్స్ నమోదయ్యాయి ”

Read more Photos on
click me!

Recommended Stories