LIC Bima Sakhi Yojana: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేకంగా బీమా సఖి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంపికైన మహిళలు LIC ఏజెంట్లుగా పనిచేసే అవకాశం పొందుతారు. ఈ పథకం ప్రయోజనాలేంటీ ?
LIC Bima Sakhi Yojana: మహిళలకు ఆర్థిక స్వావలంబనను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకం ఇది. మోదీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రారంభించిన ఈ బీమా సఖి యోజన ద్వారా, ఎంపికైన మహిళలు LIC ఏజెంట్లుగా సేవలందించేందుకు అవకాశం పొందుతున్నారు. మహిళ ఏజెంట్లకు ఎటువంటి ప్రీమియం లేకుండా ప్రతి నెలా ₹ 7000 పొందుతారు. ఇంతకీ ఆ పథకం లక్ష్యం ఏంటీ ? ఈ పథకానికి అర్హులు ఎవరు? అనే విషయాలు మీ కోసం..
26
అంతిమ లక్ష్యం ఇదే..
LIC బీమా సఖి కార్యక్రమం కింద, ఎంపిక చేయబడిన మహిళలకు మొదటి మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ, నెలవారీ స్టైఫండ్ ఇవ్వబడుతుంది, ఇది వారు LIC ఏజెంట్‌గా కెరీర్‌ను నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. బీమా సఖి పథకం ప్రధాన లక్ష్యాలలో ఒకటి మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడం, తద్వారా వారు తమ స్థానిక ప్రాంతాలలో బీమా గురించి అవగాహన పెంచుకోగలుగుతారు.
36
ఈ పథకానికి అర్హులెవరు?
బీమా సఖి యోజనను బీమా సఖి పథకం అని కూడా పిలుస్తారు. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. అర్హులైన మహిళలకు LIC ఏజెంట్లుగా ఎంపిక చేస్తారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. మొదటి మూడు సంవత్సరాలు ప్రతి నెలా స్టైపెండ్ కూడా అందించబడుతుంది.
అర్హులు కానివారు: LIC ఉద్యోగుల బంధువులు, రిటైర్డ్ కార్పొరేషన్ ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు, జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు ఈ పథకానికి అర్హులు కారని గమనించాలి.
ఈ పథకం ఎంపికైన మహిళలు పాలసీలపై కమిషన్ పొందడమే కాకుండా మొదటి మూడు సంవత్సరాలు స్టైపెండ్ కూడా అందుకోవచ్చు. మొదటి సంవత్సరంలో వారికి ప్రతి నెలా రూ. 7,000 అందిస్తారు. రెండవ సంవత్సరంలో రూ.6000, మూడవ సంవత్సరం రూ.5000 అందుకుంటారు. కానీ దీనికి షరతు ఏమిటంటే ఇక్కడ మొదటి సంవత్సరంలో పూర్తి చేసిన పాలసీల్లో కనీసం 65% రెండవ సంవత్సరం కూడా కొనసాగాలి. ఇక్కడే 65 శాతం కంటే తక్కువ ఉంటే మాత్రం ఆ మొత్తం అందుకోలేరని గుర్తించుకోండి.
56
మహిళల ఆర్థిక స్వాలంబన
మహిళలను ఆర్థికంగా శక్తివంతులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పథకమే బీమా సఖి యోజన. ఈ పథకం గ్రామీణ భారతదేశంలో పెద్ద విజయాన్ని సాధిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ప్రతి నెలా రెండు లక్షలకు పైగా మహిళలు ఆదాయాన్ని పొందుతూ తమ జీవితాలను మార్చుకుంటున్నారు.
ఈ పథకం ద్వారా బీమా ఏజెంట్లుగా మారిన మహిళలు తమ కెరీర్‌ను ఉన్నతంగా నిర్మించుకుంటూ, స్థిర ఆదాయాన్ని పొందుతున్నారు. ఇది మహిళలకు ఒక స్వయం ఉపాధి అవకాశంగా మారిందని చెప్పవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రకారం, 2024 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే 2.05 లక్షల మంది మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి, LIC , గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసంను కూడా పొందుతున్నారు.
66
బీమా సఖిలకు భారీ మద్దతు
లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ బీమా సఖి పథకానికి సంబంధించిన తాజా వివరాలు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీమా సఖిలకు రూ. 62.36 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి, LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రూ. 520 కోట్ల బడ్జెట్‌ను బడ్జెట్‌ను కేటాయించింది. అందులో రూ. 115.13 కోట్లు ఇప్పటికే జూలై 14 వరకు బీమా సఖిలకు చెల్లించబడినట్టు మంత్రి తెలిపారు. ఈ గణాంకాలు బీమా సఖి యోజనకు ప్రభుత్వం, LIC ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.