Moon Hotel : భూమిపై కాదు.. ఇక చంద్రుడిపై హనీమూన్ ! ఒక్క నైట్ రేటు మైండ్ బ్లాక్ !

Published : Jan 15, 2026, 07:34 PM IST

Moon Hotel : అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ చంద్రుడిపై హోటల్ నిర్మిస్తోంది. 2032 నాటికి అందుబాటులోకి రానున్న ఈ హోటల్‌లో ఒక్క రాత్రికి ఎంత ఖర్చవుతుందనే విషయాలు వెల్లడించింది. బుకింగ్స్ వివరాలు సహా మొత్తం ట్రిప్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
చంద్రుడిపై విహారయాత్ర.. కల నిజం కాబోతోంది

చంద్రుడి అంచున ఉయ్యాల... అంటూ పాటల్లో పాడుకోవడం, జాబిల్లిపైకి వెళ్లాలని కలలు కనడం మనం ఇన్నాళ్లూ చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ కలలు కేవలం కవిత్వానికే పరిమితం కాబోవు. రాబోయే రోజుల్లో ఇది నిజం కానుంది. చంద్రుడిపై విహరించడమే కాదు, అక్కడ దర్జాగా హోటల్‌లో బస చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

అమెరికాకు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీనికోసం అవసరమైన నిధులను సమీకరించడమే కాకుండా, ఏకంగా హోటల్ గదుల కోసం రిజర్వేషన్లు కూడా ప్రారంభించేసింది. అయితే అక్కడికి వెళ్లాలంటే జేబులో ఎంత ఉండాలి? అక్కడ ఒక్క రాత్రి గడపాలంటే ఎంత ఖర్చవుతుంది? అనే ఆసక్తికరమైన వివరాలు గమనిస్తే..

26
జాబిల్లిపై హోటల్ : అమెరికన్ స్టార్టప్ భారీ ప్లాన్

కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘గెలాక్టిక్ రిసోర్స్ యూటిలైజేషన్ స్పేస్’ (GRU) అనే స్పేస్ స్టార్టప్ ఈ అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టింది. చంద్రుడిపై ప్రపంచంలోనే మొట్టమొదటి పర్మనెంట్ హోటల్‌ను నిర్మిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారు. 2032 నాటికి ఈ హోటల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఒక కల్పిత కథగా భావించినా, ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనులు మొదలవ్వడంతో ఇది వాస్తవ రూపం దాలుస్తోంది.

36
21 ఏళ్ల యువకుడి సాహసం.. దిగ్గజాల సపోర్టు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ ప్రాజెక్టు వెనుక ఉన్నది కేవలం 21 ఏళ్ల వయసున్న స్కైలర్ చాన్ (Skyler Chan). ఇతను స్థాపించిన ఈ కంపెనీకి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల నుంచి సపోర్టు లభిస్తోంది. ఎన్విడియా (Nvidia), స్పేస్ ఎక్స్ (SpaceX), వై కాంబినేటర్ (Y Combinator), డిఫెన్స్ టెక్ సంస్థ అండురిల్ వంటి సంస్థలతో సంబంధం ఉన్న ఇన్వెస్టర్లు ఈ ప్రాజెక్టుకు సపోర్ట్ చేస్తున్నారు. నిధుల సేకరణ కూడా జోరుగా సాగుతోంది.

46
చందమామ పై హోటల్ లో ఒక్క రాత్రికి రూ.3.7 కోట్లు

చంద్రుడిపై హోటల్ అనగానే ఖర్చు కూడా ఆకాశాన్ని తాకేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిపోర్టుల ప్రకారం, ఈ హోటల్‌లో ఒక్క రాత్రి బస చేయడానికి సుమారు 4,10,000 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 3.7 కోట్లు అన్నమాట. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ యాత్ర చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే బుకింగ్ చేసుకోవచ్చు. అయితే, రిజర్వేషన్ కోసం వినియోగదారులు ఇప్పుడు 10 లక్షల డాలర్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సామాన్యులకు అందుబాటులో లేకపోయినా, కుబేరులకు మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశం.

56
నిర్మాణానికి చంద్రుడి మట్టి

సాధారణంగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్లు వంటివి నిర్మించాలంటే భూమి నుంచే భారీగా నిర్మాణ సామగ్రిని పంపించాల్సి ఉంటుంది. ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ, జీఆర్ యూ సంస్థ మాత్రం వినూత్నంగా ఆలోచిస్తోంది. హోటల్ నిర్మాణం కోసం భూమి నుంచి మెటీరియల్ తీసుకెళ్లకుండా, చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని మాత్రమే ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అన్ని అనుమతులు లభిస్తే, 2029 నుంచి హోటల్ నిర్మాణం ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అనుమతుల కోసం ఒక టెస్ట్ మిషన్ నిర్వహించాలని కూడా కంపెనీ ప్లాన్ చేసింది.

66
2032 నాటికి స్వాగతం పలికే ఛాన్స్

కంపెనీ వేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే, 2032 సంవత్సరంలో చంద్రుడిపై హోటల్ తన మొదటి గెస్ట్‌లను ఆహ్వానిస్తుంది. అంటే మరో ఆరేళ్లలో మనం చంద్రుడిపై బస చేసే అవకాశాన్ని చూడబోతున్నాం. అయితే, ప్రస్తుతం ఉన్న ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోయినా, భవిష్యత్తులో స్పేస్ ట్రావెలర్స్ సంఖ్య పెరిగే కొద్దీ హోటల్ అద్దె తగ్గే అవకాశం ఉందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా, మానవ శక్తి  చంద్రమండలంపై కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి సిద్ధమైందని ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories