SCSS Scheme: వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం రావాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన సేవింగ్ స్కీమ్స్‌లో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒకటి.
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన చిన్న పొదుపు పథకం ఇది. ప్రభుత్వ హామీ ఉండటంతో ఇది అత్యంత సురక్షిత పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. రిటైర్ అయిన తర్వాత స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారింది.
25
ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది?
ఏప్రిల్-జూన్ 2026 త్రైమాసికానికి SCSSపై ప్రభుత్వం 8.2% వార్షిక వడ్డీ కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన సమీక్షలో చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ స్కీమ్ గడువు 5 సంవత్సరాలు ఉంటుంది. అవసరమైతే మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.
35
రూ.30 లక్షలు పెట్టుబడిపై ఎంత ఆదాయం వస్తుంది?
ఒక సీనియర్ సిటిజన్ SCSSలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ ప్రకారం ప్రతి మూడు నెలలకు రూ.61,500 వడ్డీ వస్తుంది. పెట్టుబడి మొత్తం రూ.30 లక్షలు, వడ్డీ రేటు 8.2% అయితే.. ప్రతి మూడు నెలలకు వడ్డీ రూ.61,500 వస్తుంది. సంవత్సరానికి మొత్తం వడ్డీ రూ.2,46,000 పొందొచ్చు. ఈ మొత్తాన్ని ఏడాదిలో నాలుగు సార్లు పొందవచ్చు. అకౌంట్‌ను పొడిగించకుండా కూడా 5 సంవత్సరాల పాటు ఈ ఆదాయం కొనసాగుతుంది.
ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ అర్హులైతే విడివిడిగా లేదా జాయింట్ అకౌంట్ రూపంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అలా ఇద్దరూ తమ తమ అకౌంట్లలో రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే నిర్ణయించిన పరిమితిని మించి డబ్బు జమ చేస్తే అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
55
ట్యాక్స్ బెనిఫిట్స్, అకౌంట్ పొడిగింపు
SCSS ద్వారా వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని 80TTB సెక్షన్ ప్రకారం సీనియర్ సిటిజన్లు రూ.50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ అకౌంట్‌ను 5 సంవత్సరాల తర్వాత మూసివేయవచ్చు. లేదంటే మెచ్యూరిటీ తర్వాత మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకోసం మెచ్యూరిటీ తేదీ నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేయాలి.