ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు సాధ్యంకాని ధరలకే మీషోలో వస్తువులు లభిస్తుంటాయి. మరి మీషోకే ఇంత తక్కువ ధరలు ఎలా సాధ్యం.. దాని బిజినెస్ సీక్రేట్ ఏమిటి?
Meesho : భారతదేశంలో సాధారణ, మధ్య తరగతి జనాభే ఎక్కువ. వారినే టార్గెట్ చేసుకుని అత్యంత తక్కువ ధరలకే వస్తువులను అందిస్తోంది భారతీయ ఇ-కామర్స్ కంపెనీ మీషో. దిగ్గజ ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటివాటికి సాధ్యంకానిది మీషోకు ఎలా సాధ్యం అవుతోంది... ఇంత తక్కువ ధరలకు ఎలా అందిస్తోంది? నాణ్యతలేని వస్తువులను అంటగడుతోందా...? అనే అనుమానం చాలామందికి వచ్చివుంటుంది. మరి మీషో బిజినెస్ సీక్రేట్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
25
మీషోలో ఇంత తక్కువ ధర ఎలా?
మీషోలో వస్తువులు ఇంత తక్కువ ధరకు ఎలా వస్తున్నాయో ఉదాహరణతో సహా వివరించాడు ప్రజ్వల్ అనే లింక్డిన్ యూజర్. అతడి ప్రకారం... ఉదాహరణకు ఓ టీషర్ట్ ధర మీషోలో రూ.269 ఉందనుకుందాం. ఇందులో దాని తయారీకి దాదాపు రూ.150, మార్కెటింగ్ కు రూ.50, లాజిస్టిక్ కు రూ.50-80 ఖర్చు అవుతుంది. మరి దీన్ని అమ్మడం ద్వారా మీషోకు లాభం ఏంటి? అంటే ఇక్కడే దీని బిజినెస్ సీక్రెట్ దాగివుంది.
35
90 శాతం ఇండియన్సే మీషో టార్గెట్..
ఇండియాలో మూడు రకాల వినియోగదారులు ఉంటారు. ధర ఎంతున్నా సరే తొందరగా ఆ వస్తువు తమకు చేరాలనుకునేవారు. ఇలాంటివారు కేవలం 10 శాతంమందే. మిగతా 90 శాతంమంది తక్కువ ధరకు మంచి నాణ్యమైన వస్తువు వస్తుందంటే కాస్త ఆలస్యమైనా పరవాలేదని అనుకుంటారు. వీరినే మీషో టార్గెట్ చేస్తోంది... రవాణా ఖర్చులు తగ్గించుకుని లాభాలను పొందుతోంది.
ఇతర ఇ-కామర్స్ దిగ్గజాల మాదిరిగా మీషో ఖరీదైన ఎయిర్ ప్లేన్స్ రవాణాను ఉపయోగించడంలేదు... అలాగే కోట్లాది రూపాయలతో భారీ వేర్ హౌస్ లను నిర్మించడంలేదు. రవాణా కోసం సొంత ట్రక్కులు, బైక్స్ కూడా ఉపయోగించడంలేదు. మీషో ప్రత్యేక సాప్ట్ వేర్ ను ఉపయోగిస్తోంది… దీని ద్వారా అద్భుతమైన బిజినెస్ మోడల్ ను రూపొందించింది.
ఏదైనా సరుకును ఒకచోటి నుండి మరోచోటికి చేర్చే ట్రక్కులను ఈ సాప్ట్ వేర్ గుర్తిస్తుంది... ఇవి తిరుగుప్రయాణంలో ఖాళీగానే ఉంటాయి కాబట్టి వీటిలో అతి తక్కువ ధరకు తమ సరుకును రవాణా చేస్తోంది మీషో. తద్వారా పైన పేర్కొన్న టీషర్ట్ రవాణా ఖర్చు రూ.50-80 నుండి రూ.20-30 కు తగ్గుతుంది…ఇలా యావరేజ్ డెలివరీ ఛార్జీలను రూ.37 కు తగ్గించుకుంటోంది మీషో. తద్వారా అతి తక్కవ ధరకే వినియోగదారుడికి వస్తువును అందిస్తూ మీషో లాభాలను పొందుతోంది.
55
మీషో సక్సెస్ మంత్ర..
ఇలా మీషో బిజినెస్ సీక్రెట్ సరుకు రవాణాలో దాగివుందని లింక్టిన్ యూజర్ ప్రజ్వల్ తెలిపారు. మీషో సగటు డెలివరీ ఖర్చు చాలా తక్కువ... అందులోనే వీరి లాభం దాగివుంటుందని తెలిపారు. ఇలా లాజిస్టిక్ పీడకలను లాభదాయక సామ్రాజ్యంగా మార్చి అద్భుతాలు చేస్తోంది మీషో. ఆస్తిరహిత మీషో బిజినెస్ నమూనా సుదీర్ఘకాలంగా నిలదొక్కుకుంది... అంటే ఇది సక్సెస్ అయినట్లే.