చలికాలంలో ఈ వ్యాపారం చేశారంటే లాభాలే లాభాలు

Published : Dec 03, 2025, 07:48 PM IST

Businesses in winter:  చలికాలంలో ఇంటి నుండి తక్కువ పెట్టుబడితో కొన్ని లాభదాయకమైన వ్యాపారాలను చేయవచ్చు. హోల్‌సేల్ మార్కెట్ల నుండి వస్తువులను కొనుగోలు చేయడం లేదా ఇంట్లో తయారు చేయడం ద్వారా అధిక లాభాలను అందించే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి.

PREV
15
చలికాలంలో చేసే వ్యాపారాలు

చలికాలంలో ఇంటి నుండి ప్రారంభించగల చిన్న వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. వీటికి పెట్టే పెట్టుబడి చాలా తక్కువగానే ఉంటుంది. కానీ మంచి లాభాలు వస్తాయి. ఢిల్లీ, జైపూర్, లూథియానా వంటి ప్రధాన హోల్‌సేల్ మార్కెట్ల నుండి చౌకగా వస్తువులు కొని లేదా ఇంట్లో తయారుచేసిన వస్తువులను అమ్మి మీరు ప్రతినెలా వేల నుండి లక్షల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు.

25
ఫ్యాషన్ యాక్సెసరీ బిజినెస్

ఈ బిజినెస్ పెట్టడానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం పడుతుంది. ఎక్కువ లాభం కోసం, మహిళల ఫ్యాషన్ యాక్సెసరీస్ వ్యాపారం ఉత్తమమైనది. ఢిల్లీ సదర్ బజార్‌లో హెయిర్ క్లచ్‌లు, పిన్‌లు, లేసులు వంటివి చాలా చౌకగా దొరుకుతాయి. అక్కడ కొని తెచ్చుకుని ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మవచ్చు. అక్కడ అయిదు రూపాయలకు దొరికే క్లిప్ ఇక్కడ 50 రూపాయలకు అమ్మే ఛాన్స్ ఉంది.  ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో అమ్మినా మంచి లాభాలు వస్తాయి. మహిళల యాక్సెసరీస్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

35
స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు

చలికాలంలో స్వెటర్లు, ఉన్ని దుస్తులకు డిమాండ్ ఎక్కువ. మెషిన్-మేడ్ స్వెటర్లు ఇప్పుడు అనేక డిజైన్లలో దొరుకుతున్నాయి. లూథియానా, పానిపట్, ఢిల్లీ మార్కెట్లలో ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. మీకు కుట్టడం, అల్లడం తెలిసి ఉంటే, సొంతంగా స్వెటర్లు తయారు చేసి ఇన్‌స్టాగ్రామ్, మీషో, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మవచ్చు. ఒక్కో స్వెటర్‌పై ₹150-300 వరకు లాభం పొందవచ్చు.

45
హాట్ చాక్లెట్లు

చలికాలంలో వేడి సూప్‌లు, హాట్ చాక్లెట్‌లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. మీకు వంట చేయడం ఇష్టమైతే, ఈ వ్యాపారం మీకు సరైనది. ఇంట్లోనే హెల్తీ వెజిటబుల్ సూప్, స్వీట్ కార్న్ సూప్, టొమాటో సూప్, హాట్ చాక్లెట్ తయారు చేసి మీ ప్రాంతంలో డెలివరీ చేయవచ్చు. దీనికి చిన్న వంటగది, మంచి ప్యాకేజింగ్ ఉంటే చాలు. వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేసి కస్టమర్లను ఆకర్షించవచ్చు.

55
చవక దుప్పట్లు

చలికాలంలో దుప్పట్లకు డిమాండ్ ఎప్పుడూ పెరుగుతుంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న పానిపట్, దుప్పట్లకు అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. ఇక్కడ తక్కువ ధరకు దుప్పట్లు కొని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తారు. మీరు దుప్పట్లను పెద్దమొత్తంలో కొని ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. స్థానిక మార్కెట్లో లేదా ఇంటి నుండే తక్కువ స్టాక్‌తో ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంలో 20 నుండి 45 శాతం వరకు లాభం సులభంగా వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories