FASTag Annual Pass: బంపరాఫర్.. రూ. 3,000 చెల్లిస్తే.. ఏడాది టోల్ ఫ్రీ జర్నీ

Published : Aug 03, 2025, 02:45 PM IST

NHAI Launches FASTag Annual Pass: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)ఆగస్టు 15, 2025 నుండి కొత్త FASTag వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెడుతోంది. కేవలం రూ. 3,000 ధరకే ఈ ఆఫర్, రోజువారీ హైవే ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.   

PREV
16
ఒక్కసారి చెల్లిస్తే.. ఏడాది టోల్ ఫ్రీ జర్నీ

FASTag Annual Pass: మీరు తరచుగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణాలు చేస్తుంటారా? టోల్ ప్లాజాల దగ్గర టోల్ ఫీ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకవచ్చింది. ఇప్పుడు ఒక్కసారి డబ్బు కడితే చాలు, ఏడాది పొడవునా టోల్ భారం లేకుండా కేవలం కొన్ని సెకన్లలో టోల్ ప్లాజా దాటేయొచ్చు. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వార్షిక టోల్ విధానం ఏమిటి? ఇలా పొందాలి? ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం.

26
కొత్త ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ :

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)టోల్ పన్ను చెల్లించే విధానాన్ని త్వరలో మార్చబోతోంది. హైవేపై ప్రయాణించే ప్రయాణీకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, టోల్ చెల్లింపులను సులభతరం చేయడానికి NHAI కొత్త టోల్ పాస్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 

ఇప్పుడు తాజాగా వార్షిక టోల్ పాస్ వ్యవస్థ ఆగస్టు 15 అంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమలులోకి తీసుకరాబోతుంది. 

అది కూడా కేవలం రూ. 3000 చెల్లిస్తే.. ప్రైవేట్ వాహన యజమానులకు టోల్ ప్రయోజనాలను అందించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో దీనిని తీసుకవచ్చారు.

36
ఖర్చు ఆదా.. అడ్డంకులు లేని ప్రయాణం..

ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేయాలంటే కొత్త FASTag కొనాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌తోనే RajmargYatra మొబైల్ యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. 

అందులో మీ వాహన వివరాలు నమోదు చేసి, చెల్లింపు పూర్తిచేస్తే, 2 గంటల్లోపు మీ FASTag పాస్ యాక్టివ్ అవుతుంది. చెల్లింపు అనంతరం మీరు SMS లేదా ఇమెయిల్ ద్వారా ధృవీకరణ పొందుతారు. 

ఈ కొత్త పథకం ద్వారా ప్రయాణికులు తమ డైలీ టోల్ ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా, వేగవంతమైన ప్రయాణాన్ని అనుభవించవచ్చు. ఇది స్మార్ట్ ట్రావెల్‌కు మరొక అడుగు అని చెప్పొచ్చు.

46
యాన్యువల్‌ పాస్‌ యాక్టివేషన్ ఎలా చేయాలి?
  • FASTag యాన్యువల్‌ పాస్‌ యాక్టివేషన్ కోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో RajmargYatra మొబైల్ యాప్‌ను తెరవండి లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 
  • ప్రస్తుత FASTag ఆధారాలతో (యూజర్ ID/పాస్‌వర్డ్) పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, FASTag ID వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఈ సిస్టమ్ మీ వెహికల్ స్టేటస్, FASTag స్థితిని ఆటోమెటిక్ గా ధృవీకరిస్తుంది. 
  • ఈ తనిఖీ మీ వాహనం యాన్యువల్‌ పాస్‌కు అర్హత కలిగి ఉందో లేదో నిర్ధారిస్తుంది. 
  • ధృవీకరణ తర్వాత 2025-26 సంవత్సరానికి ₹3,000 చెల్లించమని మిమ్మల్ని అడుగుతారు.
  • చెల్లింపు కోసం మీరు UPI,ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి డిజిటల్ చెల్లింపు సేవలను ఉపయోగించవచ్చు.
  • తరువాత FASTagలో వార్షిక పాస్ యాక్టివేట్ చేయబడుతుంది. SMS లేదా ఇమెయిల్ ద్వారా నిర్ధారణను అందుకుంటారు. 
  • ధృవీకరణ తర్వాత 2 గంటల్లోపు యాక్టివేషన్ అవుతుంది. 
56
ప్రయోజనాలు
  • నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సాధారణ హైవే ప్రయాణికుల కోసం ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. సరికొత్త FASTag వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకవస్తుంది.
  • ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పుల వరకు ఉచిత రైడ్‌లను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది, ఏది ముందుగా వస్తే అది. కేవలం రూ. 3,000 ఫ్లాట్ ఫీజు చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. 
  • ఈ ప్రాసెస్ జాతీయ రహదారులు లేదా ఎక్స్‌ప్రెస్‌వేలను క్రమం తప్పకుండా ఉపయోగించే తరచుగా ప్రయాణించే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 
  • ఒక్కసారి 3,000 చెల్లించి, ఏడాది పొడవునా లేదా 200 ట్రిప్పుల వరకు టోల్ ప్లాజాల వద్ద పదిలాలు లేకుండా వేగంగా ప్రయాణించొచ్చు.
  • రెగ్యులర్ హైవే ప్రయాణికులకు ఖర్చు తగ్గుతుంది. టోల్ ప్లాజాలకు దగ్గరగా నిలిచే సమయం తగ్గుతుంది. ఇంకా ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. 
  • ఈ విధానం ప్రధానంగా తరచూ నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలను ప్రయాణించే ప్రైవేట్ వాహన దారులకు సులభత కలిగిస్తుంది.
66
కొన్ని కీలక నియమాలు
  • కొత్త FASTag కొనవలసిన అవసరం లేదు. మీ ప్రస్తుత FASTag అర్హత కలిగి ఉంటే, వార్షిక పాస్ అదే రోజున యాక్టివేట్ చేయబడుతుంది. ఈ పాస్ బదిలీ చేయబడదు. 
  • FASTag అతికించబడి లేదా నమోదు చేయబడిన వాహనానికి మాత్రమే చెల్లుతుంది. 200 ట్రిప్పులు పూర్తి చేసిన తర్వాత లేదా 365 రోజుల తర్వాత ఆటోమెటిక్ గా క్లోజ్ అవుతుంది. 
  • మళ్లీ తిరిగిపొందాలంటే.. వినియోగదారులు మరో రూ. 3,000 చెల్లించడం ద్వారా ప్రయోజనాన్ని పునరుద్ధరించవచ్చు.
Read more Photos on
click me!

Recommended Stories