Mutual Fund: పెట్టుబడికి లాభం.. అవసరానికి లోన్.. మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ తీసుకోవడం ఎలా?

Published : Aug 03, 2025, 04:49 PM IST

Mutual fund loans: మ్యూచువల్ ఫండ్స్ ను పూచీకత్తుగా పెట్టి ఇన్‌స్టెంట్ గా లోన్ పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీ కే. అయితే.. మ్యూచువల్ ఫండ్స్ పై లోన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటీ? ఓ లూక్కేయండి.

PREV
16
మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్

Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, వాటిని అమ్మకుండానే సులభంగా లోన్ పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ను పూచీకత్తుగా పెట్టి రుణం తీసుకోవచ్చు. తక్కువ వడ్డీతో లోన్ పొందడమే కాకుండా పెట్టుబడిని అలాగే కొనసాగించవచ్చు. మరి ఈ రుణం ఎలా తీసుకోవాలి? దీని వల్ల ఉపయోగాలు ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.

26
మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్‌స్టెంట్ లోన్ అంటే ఏమిటి?

మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను పూచీకత్తుగా పెట్టి వెంటనే లోన్ పొందే మార్గం. ఈ లోన్ ను మ్యూచువల్ ఫండ్లపై లోన్ ( LAMF) అంటారు. ఈ లోన్స్ ను బ్యాంకులు, NBFCలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) అందిస్తాయి. మీరు పొందగలిగే లోన్ మొత్తం, మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. లోన్ అప్లై చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల వివరాలు, ఫోలియో నంబర్లు, స్కీమ్ పేర్లు బ్యాంకుకు ఇవ్వాలి. అలాగే.. రుణ గ్రహీత తన యూనిట్లపై రుణదాతకు హక్కు కల్పిస్తూ ఒక ఒప్పందం చేసుకుంటారు. దీనినే 'లీన్ అగ్రిమెంట్' అంటారు. ఒక వేళ రుణం చెల్లించడంలో విఫలమైతే, తనఖా పెట్టిన యూనిట్లను అమ్మే హక్కు బ్యాంకుకు కల్పించడం.

36
ప్రయోజనాలు (Advantages)

పాస్ట్ ప్రాసెసింగ్: పెట్టుబడులను అమ్మకుండానే డబ్బు పొందవచ్చు. బెసిక్ డాక్యుమెంటేషన్, డిజిటల్ అటాక్ మెంట్ తో తక్కువ సమయంలో లోన్ మంజూరు అవుతుంది.

లోన్ అమౌంట్: మీ మ్యూచువల్ ఫండ్ రకాన్ని బట్టి లోన్ అమౌంట్ నిర్ణయించబడుతుంది. ఈక్విటీ ఫండ్స్‌కి తక్కువ, డెబ్ట్ ఫండ్స్‌కి ఎక్కువ మొత్తంలో లోన్ మంజూరు అవుతుంది.

కాల పరిమితి: మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా మీ సౌలభ్యం, స్థోమత ప్రకారం మీ రుణానికి తిరిగి చెల్లించే కాలపరిమితి ఎంచుకోవచ్చు.

తక్కువ వడ్డీ : వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కంటే దీనిపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇది ఒక సురక్షితమైన రుణం కాబట్టి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.

వినియోగ స్వేచ్ఛ: ఈ లోన్‌ను ఏ వ్యక్తిగత అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చు. పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్స్‌పై డివిడెండ్లు లేదా వడ్డీని పొందవచ్చు.

46
ప్రతికూలతలు (Risks)

మార్కెట్ ఒడిదుడుకులు: మ్యూచువల్ ఫండ్స్ విలువ మార్కెట్ ఆధారంగా మారుతుంది. విలువ తగ్గితే, లోన్ టు వ్యాల్యూ నిష్పత్తిపై ప్రభావం పడుతుంది.

లిక్విడేషన్ రిస్క్: తనఖా ఉన్నంత కాలం మ్యూచువల్ ఫండ్ యూనిట్లను అమ్మలేరు లేదా స్విచ్ చేయలేరు. ఒకవేళ లోన్ తిరిగి చెల్లించకపోతే, అలాంటి సందర్భంలో రుణదాత తనఖా పెట్టిన యూనిట్లను అమ్మేస్తాడు.

రుణ పరిమితి: మీకు అధిక రుణ మొత్తం అవసరమైతే, ముఖ్యంగా మీరు ఈక్విటీ నిధులను పూచీకత్తుగా అందిస్తున్నట్లయితే మీరు కోరుకున్న రుణ మొత్తాన్ని పొందలేకపోవచ్చు. అలాగే.. మ్యూచువల్ ఫండ్స్‌పై తీసుకునే రుణాలపై సాధారణంగా 8 శాతం నుంచి 12 శాతం వరకు వడ్డీ ఉంటుంది. కొన్ని సంస్థలు రోలింగ్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా అందిస్తాయి

56
మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్‌స్టెంట్ లోన్ తీసుకోవాలా?

మ్యూచువల్ ఫండ్స్ పై రుణం తీసుకోవడం తెలివైన నిర్ణయమే. ఈ విధమైన లోన్ తీసుకుంటే.. తక్కువ వడ్డీ రేట్లు, వేగవంతమైన డిస్బర్స్మెంట్, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ వంటివి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, మీరు అప్పు తిరిగి చెల్లించలేకపోతే, మీ ఫండ్స్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. తగిన ప్రణాళికతో, రిస్క్‌ను అర్థం చేసుకొని, సరైన పద్దతిలో తిరిగి చెల్లిస్తే.. ఇది స్మార్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు అధిక మొత్తం అప్పు అవసరం పడితే లేదా రిస్క్ తట్టుకోలేని స్థితిలో ఉంటే.. మరొక ప్రత్యామ్నాయాన్ని పరిశీలించడమే మంచిది.

66
గుర్తించుకోవాల్సిన విషయాలు

సాధారణ వ్యక్తిగత లోన్లతో పోల్చితే ఇన్‌స్టెంట్ లోన్స్ తక్కువ వడ్డీ రేట్లతో అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ లోన్ తీసుకునే ముందు మీరు అవసరాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బాగా విశ్లేషించుకోవాలి.

ఒక్కసారి డిఫాల్ట్ అయినా, క్రెడిట్ స్కోరు తగ్గి భవిష్యత్తులో లోన్లు పొందడం కష్టమవుతుంది. అందుకే, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.

(గమనిక: లోన్ తీసుకోవడం మానసిక, ఆర్థిక బాధ్యతతో కూడిన పని. పూర్తి అవగాహనతో ముందుకు సాగాలి.)

Read more Photos on
click me!

Recommended Stories