సాధారణంగా మనం బంధువులకు, స్నేహితులకు లేదా తెలిసిన వాళ్లకు డబ్బు అప్పుగా ఇస్తుంటాం. దానివల్ల వారి అవసరం తీరుతుంది. మనకు అదనంగా కొంత మొత్తం.. వడ్డీ రూపంలో తిరిగి వస్తుంది. కానీ అప్పు ఇచ్చేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.
అప్పు ఇవ్వడం వల్ల ఎదుటి వ్యక్తి అవసరాలు తీరుతాయి. మరోసారి మీకు అవసరమైనప్పుడు వారు సాయం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఇచ్చిన డబ్బు మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అప్పు తీసుకున్నవారు ఎంత తెలిసిన వారైనా, దగ్గరి వారైనా అప్పు ఇచ్చే విషయంలో ఈ విషయాలు మర్చిపోవద్దు.
25
రాతపూర్వక ఒప్పందం
ఎవరికైనా సరే.. అప్పు ఇచ్చేటప్పుడు రాత పూర్వక ఒప్పందం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనిలో మొత్తం అప్పు, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే తేదీ, చెల్లింపు పద్ధతి వంటి వివరాలను కచ్చితంగా, స్పష్టంగా రాయాలి. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది.
వ్యక్తిగత సమాచారం:
అప్పు తీసుకునే వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఆ వ్యక్తి ఫోన్ నెంబర్, వీలైతే ఇంట్లోని ఇతర వ్యక్తుల ఫోన్ నెంబర్లు, చిరునామా వంటివి తెలుసుకోవాలి.
35
ఆర్థిక పరిస్థితి:
అప్పు తీసుకునే వ్యక్తి ఆర్థిక స్థితిని తెలుసుకోవాలి. వారి ఆదాయపు పన్ను రిటర్న్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఇతర ఆర్థిక పత్రాలను పరిశీలించడం మంచిది.
క్రెడిట్ నివేదిక:
అప్పు తీసుకునే వ్యక్తి క్రెడిట్ నివేదికను పరిశీలించడం ద్వారా వారి క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. తద్వారా అప్పు ఇవ్వచ్చో లేదో డిసైడ్ చేసుకోవచ్చు.
అప్పు ఒప్పంద పత్రాలపై సాక్షుల సంతకాలు తీసుకోవడం ముఖ్యం. ఇది భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఉపయోగపడుతుంది.
అధిక వడ్డీ రేట్లు:
అధిక వడ్డీ రేట్లకు అప్పు ఇవ్వడం మానుకోవాలి. ఇది అప్పు తీసుకునే వ్యక్తికి ఆర్థికంగా మరింత భారంగా మారుతుంది. దానివల్ల మొదటికే మోసం రావచ్చు. మనం ఇచ్చిన డబ్బులు కూడా మనకు తిరిగి రాకపోవచ్చు.
55
తిరిగి చెల్లించే సామర్థ్యం:
అప్పు తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించగలడా లేదా అని నిర్ధారించుకోవడం ముఖ్యం. వారి ప్రస్తుత ఆర్థిక స్థితి, వారి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పు ఇవ్వడం మంచిది.
నమ్మదగిన వ్యక్తులు:
ఎప్పుడైనా సరే… అప్పు ఇచ్చేటప్పుడు నమ్మదగిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం మంచిది. అవసరమైతే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
చట్టపరమైన సలహా:
అప్పు ఇచ్చే ముందు న్యాయవాది సలహా తీసుకోవడం మంచిది. వారు చట్టపరమైన విషయాలలో మీకు అవసరమైన సహాయం చేసే అవకాశం ఉంటుంది.
ఫైనల్ గా..
అప్పు ఇవ్వడం ముఖ్యమైన నిర్ణయం. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఇతరులకు ఇచ్చే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.