అవును... ఈ చెట్టుకు నిజంగానే డబ్బులు కాస్తాయి. లాభాలే లాభాలు. బెస్ట్ బిజినెస్ ఐడియా

Published : Aug 18, 2025, 05:49 PM IST

మారుతోన్న జీవన విధానం కారణంగా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. అందుకే ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం చేస్తున్న వారు సంఖ్య పెరుగుతోంది. మరి లాభాలు కురిపించే అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఎప్పటికీ తగ్గని డిమాండ్

చందనం సువాసన, ఔషధ గుణాలు కారణంగా శతాబ్దాలుగా విలువైనదే. ఇవి సౌందర్య లేపనాలు, సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద మందులు, అగరబత్తులు వంటి అనేక ఉత్పత్తుల్లో ఉపయోగపడుతున్నాయి. ఈ డిమాండ్ ఎప్పుడూ తగ్గకపోవడం వల్ల రైతులు, వ్యాపారవేత్తలకు ఇది లాభదాయకమైన పంటగా మారింది.

25
సాగు పద్ధతులు

శ్రీగంధం పెంపకానికి ప్రధానంగా రెండు విధానాలు ఉన్నాయి:

* సేంద్రీయ పద్ధతి – సరైన సంరక్షణ కల్పిస్తే 10–15 సంవత్సరాల్లో చెట్లు కోతకు సిద్ధం అవుతాయి.

* సాంప్రదాయ పద్ధతి – సాధారణ వ్యవసాయ పద్ధతిలో పెంచితే 20–25 సంవత్సరాలు పడుతుంది.

ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి నాణ్యత గల గంధపు చెక్కలు లభిస్తాయి.

35
ఆదాయం ఎలా ఉంటుంది.?

కోత‌కు వచ్చిన ఒక్క చందనం చెట్టు మార్కెట్లో కనీసం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ప‌లుకుతోంది. అంటే 10 చెట్లు సాగు చేస్తే సుమారు 50 లక్షలు, 100 చెట్లు ఉంటే 5 కోట్ల వరకు సంపాదించవచ్చు. అందుకే శ్రీగంధం పంటను రైతుల ‘గ్రీన్ గోల్డ్’ అని పిలుస్తారు.

45
ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.?

చందనం చెట్లు వాసన విరజిమ్మే దశకు రాగానే వాటిని జంతువుల నుంచి, అలాగే అక్రమంగా కోసే స్మగ్లర్ల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఇవి సమశీతోష్ణ వాతావరణంలో బాగా పెరుగుతాయి. కాబట్టి భద్రత, పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

55
తప్పక పాటించాల్సిన నియమాలు

శ్రీగంధం సాగు చేయదలచిన వారు చట్టపరమైన షరతులు తెలుసుకోవాలి.

* 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌గా గంధపు చెక్కలు కొనుగోలు, విక్రయాలపై నిషేధం విధించింది.

* రైతులు చెట్లు పెంచుకోవచ్చు కానీ వాటిని ప్రభుత్వానికి మాత్రమే విక్రయించాలి.

* సాగు ప్రారంభం నుంచే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలి. అధికారులు తరచూ పర్యవేక్షణ చేస్తారు.

ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే శ్రీగంధం సాగు ద్వారా మంచి లాభాలు పొందవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ రంగంలో అప్ప‌టికే వ్యాపారాలు మొద‌లు పెట్టిన వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవ‌డం ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories