IRCTC Shirdi Tour: తక్కువ బడ్జెట్ లో షిరిడి వెళ్లి రావాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ బంపర్ ఆఫర్. అతి తక్కువ ఖర్చులో సాయి నాథుని దర్శనంతో పాటు ఇతర ప్రదేశాలను చూసే అవకాశం కల్పిస్తోంది IRCTC. మరి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందామా...
IRCTC.. సాయిబాబా భక్తులకు అద్భుతమైన అవకాశాన్నికల్పిస్తోంది. ఆగస్టు నెలలో హైదరాబాద్ నుంచి షిరిడికి ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించింది. సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది షిరిడికి వెళ్తుంటారు. తక్కువ ఖర్చులో షిరిడి వెళ్లాలనుకునే వారికి IRCTC ప్రకటించిన ఈ ప్యాకేజీ మంచి ఎంపికనే చెప్పాలి.
25
Shirdi Tour
ఈ యాత్ర భారత్ గౌరవ్ పర్యాటక రైలు ద్వారా నిర్వహించబడుతుంది. ప్రయాణికులు హైదరాబాద్ (సికింద్రాబాద్), మల్కాజ్‌గిరి, కాజీపేట, ఇతర ప్రధాన స్టేషన్ల నుంచి రైలు ఎక్కవచ్చు. ఈ యాత్ర 4 రోజులు, 3 రాత్రులు ఉంటుంది. ఈ యాత్రలో షిరిడిలోని ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. ద్వారకామాయి, సావడి, శని షింగ్నాపూర్ వంటివి చూడవచ్చు.
35
షిరిడి రైలు యాత్ర
ప్రతి ప్రయాణికుడికి అవసరమైనవన్నీ ఈ ప్యాకేజీలో ఉన్నాయి. రైలు ప్రయాణం, వసతి, శాఖాహార భోజనం, స్థానిక రవాణా వంటి సౌకర్యాలను అందిస్తారు. టూర్.. సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు ఎస్కార్ట్ సేవలు, అనుభవజ్ఞులైన పర్యాటక నిర్వాహకులు ఉంటారు.
ఈ ప్యాకేజీ ధర వివిధ ట్రావెల్ ఆప్షన్స్‌కి తగ్గట్టు ఉంటుంది. ప్రయాణికుల ఎంపికను బట్టి ఒక వ్యక్తికి రూ.5,800 నుంచి రూ.10,000 వరకు ఛార్జ్ చేస్తారు. గ్రూప్ బుకింగ్‌లు, సీనియర్ సిటిజన్లకు తగ్గింపులు కూడా ఉంటాయి. కుటుంబం మొత్తం వెళ్లాలనుకునేవారికి, వృద్ధ భక్తులకు ఈ ప్యాకేజీ అనుకూలం.
55
IRCTC ఆధ్యాత్మిక యాత్ర
ఆసక్తి ఉన్నవారు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ప్రణాళిక ఒత్తిడి లేకుండా సాయిబాబా పవిత్ర నగరాన్ని సందర్శించాలని కలలు కనే వారికి ఐఆర్‌సిటిసి ప్రకటించిన ఈ ప్యాకేజీ మంచి అవకాశంగా చెప్పవచ్చు.