Investment: ర‌క్ష‌ణ రంగానికి పెరుగుతోన్న డిమాండ్‌.. ఈ స్టాక్స్‌లో పెట్టుబ‌డి పెడితే భారీ లాభాలు ఖాయం

Published : Jan 16, 2026, 03:40 PM IST

Investment: స్టాక్ మార్కెట్‌పై చాలా మందిలో అవ‌గాహ‌న పెరుగుతోంది. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయ‌ర్స్ మొద‌లు, మీడియా స్టాక్ మార్కెట్‌పై అవ‌గాహ‌న‌ను పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ర‌క్ష‌ణ రంగంపై ఆస‌క్తి పెరుగుతోంది. 

PREV
15
డిఫెన్స్ రంగానికి పెరుగుతోన్న ఆస‌క్తి

ఇప్పటి వరకు డిఫెన్స్ రంగం అంటే కేవలం ప్రభుత్వ విధానాల వరకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్‌లో డిఫెన్స్ రంగం ఒక బలమైన పెట్టుబడి అవకాశంగా మారింది. కేంద్ర బడ్జెట్ 2025లో డిఫెన్స్ కోసం రూ.6.81 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో 2026 బడ్జెట్‌లో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత్ తన డిఫెన్స్ అవసరాల్లో సుమారు 75 శాతం వస్తువులను దేశీయ కంపెనీల నుంచే కొనుగోలు చేస్తోంది. ఐదేళ్ల క్రితం ఇది 60 శాతం కూడా లేదు. ఇది డిఫెన్స్ రంగం ఎంత వేగంగా ఎదుగుతోందో చెప్పే పెద్ద సంకేతం.

25
డిఫెన్స్ కంపెనీలకు పెరుగుతున్న ఆర్డర్లు

డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలకు ప్రభుత్వ ఆర్డర్లు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం FY30 నాటికి రూ.50 వేల కోట్ల విలువైన డిఫెన్స్ ఎగుమతులు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. FY25లోనే ఈ ఎగుమతులు రూ.23,620 కోట్లకు చేరాయి. ఈ పరిణామాల వల్ల గత మూడు సంవత్సరాల్లో డిఫెన్స్ రంగానికి చెందిన షేర్లు మంచి లాభాలు ఇచ్చాయి. ఈ వృద్ధిలో సాధారణ పెట్టుబడిదారులు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అనేక మ్యూచువల్ ఫండ్ సంస్థలు డిఫెన్స్ థీమ్ ఆధారంగా ఫండ్స్ ప్రారంభించాయి.

35
ఇన్వెస్కో ఇండియా PSU ఈక్విటీ ఫండ్ వివరాలు

ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల షేర్లలో పెట్టుబడి పెడుతుంది. డిసెంబర్ 31 నాటికి ఈ ఫండ్ AUM సుమారు రూ.1,449 కోట్లుగా ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.9 శాతం. ఫండ్‌లో దాదాపు 98 శాతం పెట్టుబడి షేర్లలోనే ఉంది. బ్యాంకింగ్, డిఫెన్స్-ఏరోస్పేస్, పవర్, పెట్రోలియం రంగాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టింది. SBI, భారత్ ఎలక్ట్రానిక్స్, BPCL, ఇండియన్ బ్యాంక్, NTPC గ్రీన్ వంటి సంస్థలు టాప్ హోల్డింగ్స్. గత 10 ఏళ్లలో ఈ ఫండ్ సగటున ఏడాదికి 17.87 శాతం రిటర్న్ ఇచ్చింది.

45
HDFC డిఫెన్స్ ఫండ్ పెట్టుబడిదారులకు ఎలా ఉంది?

HDFC డిఫెన్స్ ఫండ్‌ను జూన్ 2023లో ప్రారంభించారు. ఇది పూర్తిగా డిఫెన్స్ రంగంపైనే దృష్టి పెట్టే కొత్త తరహా ఫండ్. ప్రస్తుతం దీని AUM సుమారు రూ.7,391 కోట్లుగా ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.8 శాతం. ఫండ్‌లో దాదాపు 99 శాతం పెట్టుబడి ఈక్విటీ మార్కెట్‌లోనే ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఫోర్జ్, సోలార్ ఇండస్ట్రీస్, BEML వంటి కంపెనీలు ప్రధాన పెట్టుబడులు. గత ఒక సంవత్సరంలో ఈ ఫండ్ సుమారు 13.09 శాతం రిటర్న్ ఇచ్చింది. ఇది డిఫెన్స్ ఇండెక్స్ కంటే మెరుగైన పనితీరుగా భావిస్తున్నారు.

55
కెెనరా రోబెకో మాన్యుఫాక్చరింగ్ ఫండ్ జాగ్రత్తలు

ఈ ఫండ్ మార్చి 2024లో ప్రారంభమైంది. ఇది మాన్యుఫాక్చరింగ్ థీమ్ ఆధారంగా ఉండగా, అందులో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి కూడా మంచి వాటా ఉంది. ప్రస్తుతం AUM సుమారు రూ.1,642 కోట్లుగా ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.79 శాతం. ఇండస్ట్రియల్స్, ఆటో, ఎనర్జీ, మెటీరియల్స్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడి పెట్టింది. అయితే గత ఏడాదిలో ఈ ఫండ్ కేవలం 2.74 శాతం రిటర్న్ మాత్రమే ఇచ్చింది. ఇది బెంచ్‌మార్క్‌ కంటే తక్కువ. కాబట్టి ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ అంశాన్ని తప్పనిసరిగా గమనించాలి.

గమనిక: డిఫెన్స్ థీమ్ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి అవకాశాలు ఉన్నా, ఇవి అధిక రిస్క్ కలిగిన ఫండ్స్. పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ భరించే సామర్థ్యం చూసుకుని, అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories