Mukesh Ambani House: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా ముంబైలోని యాంటిలియా భవనంలో నివాసముంటారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ లగ్జరీ భవనం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. నిత్యం రాజభవనంలా మెరిసిపోయే ఈ ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా?
Antilia : దేశంలో కాదు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి తెలియని వారు ఉండరు. దేశంలోనే రిచ్చెస్ట్ పర్సన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ గురించి మాట్లాడినప్పుడు అతడు కుటుంబంతో కలిసి నివాసముండే లగ్జరీ ఇల్లు యాంటిలియా కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే యాంటిలియా చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ఈ ఇంట్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి… ఇందులో చాలా ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయి. మరి ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో ప్రతి నెల కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
25
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ముఖేష్ అంబానీ స్థానం ఎంత..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు. 2025 ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం ముఖేష్ అంబానీ నికర విలువ $96.6 బిలియన్లు. దీంతో ఆయన ప్రపంచంలో 18వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. మరి 2026లో ఆయన ఏ స్థానంలో ఉంటారో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
35
యాంటిలియాలో సౌకర్యాలు...
ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఈ ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. యాంటిలియా 27 అంతస్తుల భవనం... ఒక్కో అంతస్తులు ఒక్కో రకమైన సౌకర్యాలు ఉంటాయి. ఇందులో జిమ్, స్పా, థియేటర్, టెర్రస్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్, ఆలయం, ఆరోగ్య సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. 150కి పైగా కార్ల కోసం పార్కింగ్ స్థలం, టెర్రస్ గార్డెన్‌లు, 3 హెలిప్యాడ్‌లు ఉన్నాయి.
45
యాంటిలియాను ఎంతకు కొనుగోలు చేశారు..?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1.120 ఎకరాల భూమిలో యాంటిలియా ఇంటి నిర్మాణం జరిగింది. 2006లో ప్రారంభమైన నిర్మాణ పనులు 2010లో పూర్తయ్యాయి. ఈ భూమిని ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ 2002లో $2.5 మిలియన్లకు కొనుగోలు చేసింది.
ఇంత పెద్ద భవనానికి నెల కరెంట్ బిల్లు ఎంత వస్తుందనే ప్రశ్న చాలామందికి తలెత్తవచ్చు. ఈ భవనం ప్రతి నెలా భారీ మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఒక రిపోర్ట్ ప్రకారం, ముఖేష్ అంబానీ ఇల్లు ప్రతి నెలా సుమారు 6 లక్షలకు పైగా యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుందట. కాబట్టి ఈ ఇంటి సగటు విద్యుత్ బిల్లు సుమారుగా 70-80 లక్షల రూపాయలు ఉంటుందట. అయితే ఈ గణాంకాలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇంత డబ్బుతో మంచి లగ్జరీ కారు కొనొచ్చు కదా.