E commerce: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌పై జ‌రిమానా.. వాటిని విక్రయిస్తున్నారన్న కారణంతో

Published : Jan 16, 2026, 01:07 PM IST

E commerce: నిబంధనలకు విరుద్ధంగా ప్రొడక్టలను విక్రయిస్తున్నారన్న కారణంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామ‌ర్స్ సంస్థ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఇంత‌కీ ఆ ప్రొడ‌క్ట్స్ ఏంటి.? దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
చట్టవిరుద్ధ ాకీ టాకీ అమ్మకాలపై CCPA సుమోటో చర్యలు

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో వాకీ టాకీల విక్రయాలపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) గట్టి చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్న పలు ఈ-కామర్స్ సంస్థలపై సుమోటోగా విచారణ ప్రారంభించి భారీ జరిమానాలు విధించింది.

25
వినియోగదారుల రక్షణ, టెలికాం చట్టాల ఉల్లంఘన

వినియోగదారుల భద్రతకు భంగం కలిగించే విధంగా కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు టెలికాం నిబంధనలను పాటించకుండా ఉత్పత్తులను లిస్ట్ చేసినట్లు CCPA గుర్తించింది. టెలికాం చట్టాలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలకు విరుద్ధంగా ఈ అమ్మకాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది

35
లైసెన్స్ మినహాయింపు వర్తించే ఫ్రీక్వెన్సీ ఇదే

సాధారణంగా 446.0 నుంచి 446.2 MHz ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేసే పర్సనల్ మొబైల్ రేడియోలకు మాత్రమే లైసెన్స్ మినహాయింపు ఉంటుంది. ఈ పరిమితిని దాటి పనిచేసే వాకీ టాకీల దిగుమతి, విక్రయాల కోసం తప్పనిసరిగా ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ (ETA) సర్టిఫికెట్ అవసరం. అంతేకాకుండా లైసెన్సింగ్ వివరాలను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

45
ప్రధాన ఈ-కామర్స్ సంస్థలపై ఆరోపణలు

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మీషో, జియో మార్ట్‌ సహా పలు సంస్థలు లైసెన్స్ మినహాయింపు పరిధిని దాటి ఉన్న వాకీ టాకీలను విక్రయించినట్లు CCPA వెల్లడించింది. అవసరమైన అనుమతులు లేకుండా ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావడం తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొంది.

55
రూ.44 లక్షల జరిమానా..

ఈ ఉల్లంఘనలపై మీషో, మెటా, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ సంస్థలకు ఒక్కొక్కదానికి రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించారు. చిమియా, జియో మార్ట్‌, టాక్ ప్రో, మాస్క్‌మ్యాన్ టాయ్స్ సంస్థలకు ఒక్కొక్కదానికి రూ.1 లక్ష ఫైన్ వేసినట్లు CCPA తెలిపింది. ఈ జాబితాలో మీషో, మెటా, చిమియా, జియో మార్ట్‌, టాక్ ప్రో సంస్థలు ఇప్పటికే జరిమానాలు చెల్లించినట్లు అధికారికంగా వెల్లడించింది.

Read more Photos on
click me!

Recommended Stories