Indian Railways: రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అది కన్ఫార్మ్ అవుతుందా లేదా అనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ (WL), ఆర్‌ఏసీ (RAC) టికెట్లు ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ చార్ట్ కోసం ఎదురుచూస్తుంటారు.
రైల్వే టికెట్ బుక్ చేసినప్పుడు సీట్లు అందుబాటులో ఉంటే వెంటనే కన్ఫర్మ్ టికెట్ లభిస్తుంది. సీట్లు పూర్తిగా నిండిపోయిన తర్వాత బుక్ చేసేవారికి వెయిటింగ్ లిస్ట్ లేదా RAC టికెట్లు జారీ అవుతాయి. ప్రయాణానికి ముందు టికెట్లు రద్దు చేసిన వారి సీట్లు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీలను వెయిటింగ్ లిస్ట్, RAC ప్రయాణికులకు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయంలో జరుగుతుంది. చార్ట్ విడుదలైన తర్వాత టికెట్ తుది స్థితి ప్రయాణికుడికి తెలుస్తుంది.
25
మొదటి రిజర్వేషన్ చార్ట్ ఎప్పుడు సిద్ధమవుతుంది?
రైల్వే మంత్రిత్వ శాఖ 2025 డిసెంబర్ 12న విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 5:01 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు, మొదటి రిజర్వేషన్ చార్ట్‌ను సాధ్యమైనంత వరకు మునుపటి రోజు రాత్రి 8 గంటలకల్లా సిద్ధం చేస్తారు. దీంతో దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు తమ టికెట్ స్థితిని ముందుగానే తెలుసుకుని ప్రయాణ ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంటుంది.
35
ఇతర రైళ్లకు చార్ట్ తయారీ సమయం ఎలా ఉంటుంది?
మధ్యాహ్నం 2:01 గంటల నుంచి రాత్రి 11:59 గంటల వరకు బయలుదేరే రైళ్లు, అలాగే అర్థరాత్రి 12:00 నుంచి ఉదయం 5:00 గంటల వరకు బయలుదేరే రైళ్లకు మొదటి చార్ట్‌ను రైలు బయలుదేరే సమయానికి కనీసం 10 గంటల ముందు సిద్ధం చేస్తారు. ఈ విధానం వల్ల ప్రయాణికులు తమ టికెట్ కన్ఫర్మేషన్ వివరాలను ముందుగానే తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
మొదటి చార్ట్ తర్వాత రైల్వేలు మరోసారి తుది రిజర్వేషన్ చార్ట్‌ను విడుదల చేస్తాయి. దీనినే ఫైనల్ రిజర్వేషన్ చార్ట్ అని పిలుస్తారు. రైల్వే అధికారుల ప్రకారం, రైలు బయలుదేరే సమయానికి సుమారు 30 నిమిషాల ముందు ఈ ఫైనల్ చార్ట్ సిద్ధమవుతుంది. చివరి నిమిషంలో జరిగిన టికెట్ రద్దులు, ఖాళీ బెర్త్‌ల వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఫైనల్ చార్ట్ విడుదలైన తర్వాతే ప్రయాణికుడి టికెట్ తుది స్థితి పూర్తిగా ఖరారవుతుంది.
55
ఫైనల్ చార్ట్‌లో వెయిటింగ్, RAC ప్రయాణికులకు ఎలా బెర్త్‌లు కేటాయిస్తారు?
తత్కాల్ కోటా లేదా ఇతర రిజర్వేషన్ కోటాల్లో ఖాళీగా మిగిలిన బెర్త్‌లు ఉంటే వాటిని ముందుగా RAC ప్రయాణికులకు, ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు కేటాయిస్తారు. ఫైనల్ చార్ట్ సిద్ధమయ్యే వరకు ఖాళీ బెర్త్‌లు ఉంటే ప్రయాణికులు వాటిని బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు చివరి వరకు తమ టికెట్ స్థితిని పరిశీలించడం మంచిది.