Rechargeable Battery: ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించాలంటే బ్యాటరీలు ఉండాల్సిందే. ఈ క్రమంలోనే రీఛార్జబుల్ బ్యాటరీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని టొరెటో సంస్థ పల్స్ ఏఏ పేరుతో రీఛార్జబుల్ బ్యాటరీలను తీసుకొచ్చింది.
పల్స్ ఏఏ యూఎస్‌బీ- సీ రీఛార్జబుల్ ఎల్ఐ-ఐయాన్ బ్యాటరీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకే ప్యాక్‌లో రెండు AA బ్యాటరీలు లభిస్తాయి. నేరుగా USB Type-C ద్వారా ఛార్జింగ్ చేయగలిగే ఈ బ్యాటరీలు స్థిరమైన విద్యుత్ సరఫరా, ఎక్కువ బ్యాకప్, దీర్ఘకాలిక వినియోగం వంటి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యాటరీలలో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ USB Type-C పోర్ట్ అందించారు. దీంతో ప్రత్యేక ఛార్జింగ్ డాక్ లేదా ఛార్జర్ అవసరం ఉండదు. ఏదైనా 5V USB Type-C ఛార్జర్‌కు నేరుగా కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా సులభంగా తీసుకెళ్లి ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
25
1.5V స్థిరమైన అవుట్‌పుట్‌తో మెరుగైన పనితీరు
సాధారణ రీచార్జబుల్ బ్యాటరీలు వాడుతున్న కొద్దీ వోల్టేజ్ తగ్గుతుంది. అయితే Toreto Pulse బ్యాటరీలు పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే వరకు స్థిరమైన 1.5 వోల్ట్ అవుట్‌పుట్ అందిస్తాయి. దీంతో రిమోట్ కంట్రోల్స్, డిజిటల్ కెమెరాలు, గేమింగ్ కంట్రోలర్లు, స్మార్ట్ లాక్స్, వైద్య పరికరాలు వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు నిరంతరాయంగా పనిచేస్తాయి.
35
4255mWh సామర్థ్యం, 2.5A హై డిశ్చార్జ్ సపోర్ట్
ఈ బ్యాటరీల్లో 4255mWh అధిక సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ సెల్స్ ఉన్నాయి. దీంతో ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం పనిచేస్తాయి. అలాగే గరిష్ఠంగా 2.5A డిశ్చార్జ్ కరెంట్ సపోర్ట్ చేయగలవు. అందువల్ల ఫ్లాష్ కెమెరాలు, ట్రిమ్మర్లు, మైక్రోఫోన్లు, బ్లూటూత్ కీబోర్డులు, రేజర్లు, బ్లూటూత్ పరికరాలు వంటి అధిక విద్యుత్ అవసరమయ్యే గ్యాడ్జెట్లలో కూడా సమర్థంగా పనిచేస్తాయి.
Toreto Pulse బ్యాటరీలను 1000 సార్లకు పైగా రీచార్జ్ చేసుకోవచ్చు. దీంతో తరచుగా కొత్త బ్యాటరీలు కొనాల్సిన అవసరం తగ్గుతుంది. డిస్పోజబుల్ బ్యాటరీల వినియోగం తగ్గి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఖర్చు ఆదా కావడంతో పాటు ఇది పర్యావరణ హిత పరిష్కారంగా కూడా నిలుస్తుంది.
55
లీక్ ప్రూఫ్ డిజైన్, బలమైన నిర్మాణం
ఈ బ్యాటరీలకు యాంటీ-లీక్ సీల్‌తోపాటు బలమైన రక్షణ కోటింగ్ అందించారు. దీంతో బ్యాటరీ లీకేజ్ ప్రమాదం తగ్గుతుంది. -20 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో కూడా సమర్థంగా పనిచేస్తాయి. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఉత్పత్తిపై 6 నెలల వారంటీ కూడా లభిస్తుంది.