Indian railways: హ‌నీమూన్ ట్రిప్‌కి వెళ్లే క‌పుల్స్‌కి పండ‌గే.. ఇకపై మీ ట్రైన్‌ జ‌ర్నీ మ‌రింత రొమాంటిక్

Published : Oct 16, 2025, 12:18 PM IST

Indian railways: కొత్త జంట‌ల‌కు ఇండియ‌న్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హ‌నీమూన్ ట్రిప్‌ను జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతిగా మార్చుకోవాల‌ని కోరుకునే జంట‌ల కోసం ప్ర‌త్యేక సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

PREV
15
ప్ర‌తీ రోజూ ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణం

భారత రైల్వేను చాలామంది దేశ జీవనాడిగా చెబుతుంటారు. ప్రతి రోజు లక్షలాది మంది ఒక చోటు నుంచి మరోచోటుకు రైల్లో ప్రయాణిస్తారు. తక్కువ ఖర్చుతో ప్రయాణించేవారికి జనరల్‌ క్లాస్‌ ఉంటే, సౌకర్యం కోరుకునే వారికి ప్రీమియం క్లాస్‌ సదుపాయాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కపుల్స్‌కి ప్రత్యేక సదుపాయాలు కల్పించే ట్రైన్లు కూడా ప్రారంభమయ్యాయి.

25
కపుల్స్‌కి ప్రైవేట్‌ స్పేస్‌తో ఫస్ట్‌ క్లాస్‌ బోగీలు

ఇప్పుడు భారత రైల్వేలోని ఎసీ ఫస్ట్‌ క్లాస్‌ బోగీల్లో కపుల్స్‌కి ప్రైవేట్‌ కేబిన్స్‌ లభిస్తున్నాయి. ఈ బోగీల్లో 2 లేదా 4 బెర్తులు మాత్రమే ఉంటాయి. చిన్న గదిలా కనిపించే ఈ కేబిన్స్‌ను కంప్లీట్‌గా క్లోజ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. దీంతో ప్రైవేట్‌గా ప్రయాణం చేయవచ్చు. ఇది కపుల్స్‌కి గోప్యత, సౌకర్యం రెండింటినీ ఇస్తుంది.

35
రాజధాని, దురంతో, శతాబ్దిలో అదనపు సౌకర్యాలు

రాజధాని ఎక్స్‌ప్రెస్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రీమియం రైళ్లలో ఎసీ ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణం కపుల్స్‌కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రైళ్లు తక్కువ రద్దీగా ఉంటాయి. ఫుడ్‌, శుభ్ర‌త‌, కంఫర్ట్‌ అన్నీ ఉన్నత స్థాయిలో ఉంటాయి.

45
లగ్జరీ హనీమూన్‌ రైళ్లు

ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌, మహారాజా ఎక్స్‌ప్రెస్‌ వంటి లగ్జరీ ట్రైన్లు హనీమూన్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వీటిలో ప్రైవేట్‌ సూట్‌లు, డైనింగ్‌ హాల్స్, హోటల్ లాంటి సౌకర్యాలు ఉంటాయి. హనీమూన్‌ ప్యాకేజీలను బుక్‌ చేసుకుంటే రైల్లోనే రాజభవనం లాంటి అనుభూతిని పొందొచ్చు.

55
కొత్త ట్రెండ్‌

ఈ రోజుల్లో చాలామంది కపుల్స్‌ ఖరీదైన ఫ్లైట్‌ల కంటే రైల్లో హనీమూన్‌ ట్రిప్‌‌ని ఎంచుకుంటున్నారు. రైల్లో ప్రయాణం రొమాంటిక్‌గా ఉండడమే కాకుండా, మార్గమధ్యంలో కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు కూడా వారి ట్రిప్‌ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. మొత్తం మీద, భారత రైల్వే ఇప్పుడు కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు, కపుల్స్‌కి గోప్యత, సౌఖ్యాన్ని కూడా అందించేలా మారిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories