Youtubers Income: ఈ యూట్యూబర్ల ముందు టాప్ హీరో హీరోయిన్లు కూడా పనికిరారు, నెలకు వీరి సంపాదన ఎంతంటే..

Published : Oct 15, 2025, 11:28 AM IST

భారతదేశంలో యూట్యూబ్ అత్యంత ప్రభావంతమైన ప్రసారం సాధనంగా మారిపోయింది. యూట్యూబ్ మీద ఆధారపడి కోట్లు సంపాదిస్తున్న వారు (Youtubers Income) ఉన్నారు. అలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఐదుగురు భారతీయ యూట్యూబర్ల గురించి ఇక్కడ ఇచ్చాము. 

PREV
16
యూట్యూబ్ లో భారీ ఆదాయం

యూట్యూబ్... అందరికీ అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రసార సాధనం. అలాగే సోషల్ మీడియా ప్లాట్ ఫారం కూడా. దీనిలో ఫ్రీగా ఛానల్ మొదలు పెట్టవచ్చు. నచ్చిన వీడియోలను వేసుకోవచ్చు. అందుకే యూట్యూబ్ కు ఆదరణ విపరీతంగా ఉంది. కేవలం యూట్యూబ్ మీద ఆధారపడే కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనదేశంలో నెలకి కోటి రూపాయలు పైగా ఆదాయం పొందుతున్న టాప్ ఫైవ్ యూట్యూబర్ల గురించి తెలుసుకోండి.

26
గౌరవ్ చౌదరి

గౌరవ్ చౌదరి టెక్నికల్ గురూజీ అనే యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నారు. దీనికి 2.37 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇతని నెలవారీ ఆదాయం అంచనా వేస్తే కళ్ళు తిరగడం ఖాయం. దాదాపు రెండు కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల మధ్య ఆయన యూట్యూబ్ నుంచి ప్రతి నెలా అందుకుంటున్నాడు.

36
భువన్ బామ్

భువన్ బామ్ బీబీకి వైన్స్ అనే ఛానల్ ను నడిపిస్తున్నారు. ఇందులో ఎక్కువగా వినోదాత్మకమైన చిన్నచిన్న నాటికలను వేస్తాడు. అలాగే ఫన్నీ వీడియోలతో కూడా అందరినీ ఆకట్టుకుంటాడు. ఇతని సబ్స్క్రైబర్ల సంఖ్య 2.65 కోట్లు. ఇక నెలవారి ఆదాయం చూసుకుంటే 1.5 కోట్ల రూపాయల నుండి రెండు కోట్ల మధ్య వరకు ఉంటుంది. భువన్ బామ్ ఇప్పుడు ఓటిటి సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు.

46
అజయ్ నగర్

అజయ్ నగర్ అంటే ఎవరికీ గుర్తు రాడు. కానీ ‘క్యారీ మినాటి’ అంటే చాలు ఇట్టే అందరికీ గుర్తొచ్చేస్తాడు. ఇందులో ఎక్కువగా రోస్టింగ్ వీడియోలు, కామెడీ వీడియోలు, గేమింగ్ వీడియోలు ఉంటాయి. ఇతనికి 4.48 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక నెలవారీ ఆదాయం చేసుకుంటే కోటి రూపాయలు నుంచి 1.5 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది.

56
అమిత్ భాదాన

అమిత్ భాదాన తన పేరు మీదే యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తున్నారు. ఇందులో కామెడీ కంటెంట్ ఉంటుంది. అది కూడా కుటుంబపరమైన కామెడీ కంటెంట్ ఉంటుంది. రోజువారీ కుటుంబ పరిస్థితులను పై కామెడీ స్కెచ్ లను చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇతని ఛానల్ కు 2.45 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక ఆదాయం విషయానికి వస్తే నెలకి కోటి నుంచి ఒకటిన్నర కోట్ల రూపాయల వరకు సంపాదిస్తారు.

66
రణబీర్ అల్లాబాడియా

రణబీర్ అల్లాబాడియ ‘బీర్ బైసెప్స్’ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్నారు. ఇందులో ఇంటర్వ్యూలు, చర్చలు వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యం, వ్యాపారం రంగంలో కూడా కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇతనికి 80 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక ఆదాయం విషయంకొస్తే ప్రతి నెల కోటి రూపాయలకు తగ్గకుండా ఈయన ఆదాయం సంపాదిస్తాడు.

Read more Photos on
click me!

Recommended Stories