ఈ ప్రోగ్రామ్‌లో ఏఐ ఏజెంట్లు వినియోగదారుల అనుమతితో మాత్రమే ట్రాన్సాక్షన్‌లు జరుపుతాయి. ఎన్పీసీఐ, రోజర్ పే భద్రతా ప్రోటోకాల్స్‌ను బలోపేతం చేశాయి. వినియోగదారుల డేటా లేదా చెల్లింపు వివరాలు చాట్ జీపీటీలో సేవ్ కాకుండా చర్యలు తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మన డేటా బయటకు వస్తుందనే భయం లేదు.
ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమితంగా కొద్దిమందికే అందుబాటులో ఉంది. పైలట్ ప్రోగ్రామ్ విజయవంతమైతే ఎన్పీసీఐ ఈ సేవలను మరిన్ని ఈ కామర్స్ వేదికలకు విస్తరించాలనే యోచనలో ఉంది.
బిగ్ బాస్కేట్ తర్వాత ఇతర కామర్స్, డిజిటల్ సేవా సంస్థలతో కలిసి ఈ ఫీచర్‌ను అందించే అవకాశం ఉంది. ఎన్పీసీఐ ఇప్పటికే IoT పరికరాల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. ఇది స్మార్ట్‌వాచ్‌లు, కనెక్టెడ్ గ్యాడ్జెట్స్ వంటి పరికరాల్లో కూడా చాట్ జీపీటీ ద్వారా చెల్లింపులను సాధ్యమయ్యేలా చేస్తుంది.
ఈ ఏఐ యూపీఐ మోడల్ భవిష్యత్తులో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లను పూర్తిగా ఆటోమేటెడ్ చేసే దిశగా ఒక పెద్ద ముందడుగు అవుతుందని ఎన్పీసీఐ పేర్కొంది. ఏఐ, యూపీఐ కలయికతో భారతీయ డిజిటల్ ఎకోసిస్టమ్ మరింత సమగ్రంగా, సులభంగా, భద్రంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు.