ఒక ఇంటి పనిమనిషి త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ (3BHK) కొనుగోలు చేసింది. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె పనిచేసే ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆమె కథను మనతో పంచుకున్నారు.
ఎన్నో ఆసక్తికర కథనాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మరొక ఆసక్తికరమైన కథనం ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో నళిని ఉనగర్ అనే యూజర్ ఈ స్టోరీని పోస్ట్ చేసింది. ఆమె ఇంట్లో పనిచేసే పనిమనిషి 3 బెడ్ రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు ఆమె తెలిపింది. సూరత్ లో ఆమె ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్టు నళిని వెల్లడించింది. ఇక ధర విషయానికి వస్తే ఆ ఫ్లాట్ అరవై లక్షల రూపాయలకు కొన్నట్టు తెలిపింది.
25
3BHKకి ఎంత లోన్ పెట్టింది?
60 లక్షల రూపాయలలో పనిమనిషి పెట్టిన లోన్ కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే. ఇక ఇంటి లోపల వుడ్ వర్క్ చేయించేందుకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆస్తులు ఉన్నా కూడా ఇంకా తనకు బతుకునిచ్చిన పనిని మాత్రం ఆమె వదలడం లేదు. ఇప్పటికీ నాలుగైదు ఇళ్లల్లో పనిమనిషిగానే చేస్తోంది.
35
ఊళ్లో ఆస్తులు
ఆ పనిమనిషికి తన గ్రామంలో రెండో అంతస్తులు ఇల్లు కూడా ఉంది. అలాగే ఒక దుకాణం కూడా ఉంది. ఆ రెండింటిని అద్దెకి ఇచ్చినట్టు ఆమె తన యజమానికి చెప్పింది. అదంతా విన్న యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెంటనే తన ఎక్స్ ఖాతాలో ఈ కథను రాసింది. ఇలా పోస్ట్ చేసిన గంటల్లోనే వైరల్ గా మారిపోయింది ఈ పోస్టు.
ఈ పోస్టుపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందించారు. కొందరు దీన్ని కష్టపడి పనిచేసి పొదుపు చేయడం వల్ల వచ్చిన ఫలితం అని అన్నారు. మరికొందరు మాత్రం పన్ను చెల్లించని డబ్బు చేసిన మాయాజాలం ఇది అని రాసుకొచ్చారు. జీతం పొందే వారు ఆదాయంలో సగం పన్నుల రూపంలోనే కోల్పోతారు. అదే వీధి వ్యాపారులు, ఇలా ఇళ్లల్లో పనిచేసే వారికి పన్ను చెల్లింపులు ఉండవు.. దానివల్ల సంపద కూడా పెట్టుకుంటారు అని అభిప్రాయ పడిన వాళ్ళు ఉన్నారు.
55
మరో వంటామె కథ
నెగిటివ్ కామెంట్స్ పెట్టినవారికి మరికొందరు పాజిటివ్ కామెంట్స్ తోనే సమాధానం ఇచ్చారు. ఎవరైనా ముందుకు సాగుతూ ఉంటే చూసి మనం సంతోషపడాలి అని మెసేజ్ లు పెట్టారు. ఇదే సమయంలో బెంగళూరుకు చెందిన మరొక యూజర్ తన వంటామే కథను కూడా పంచుకున్నారు. ఆమెకు చిన్న ఫ్లాట్ ఉందని ఆ ఫ్లాట్లో నాలుగు అంతస్తుల ఇల్లు నిర్మించాలని ఆలోచిస్తోందని చెప్పారు. అలాగే ఆమె కూతురు రాష్ట్ర హాకీజట్టులో ఆడుతోందని.. ఇక కుమారుడు జేఈఈ కోసం ప్రిపేర్ అవుతున్నాడని వివరించారు.