Credit Score: లోన్లు తీసుకుంటుంటారు గానీ సరిగ్గా EMI లు కట్టకపోవడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుంది. దాని వల్ల కొత్త లోన్లు రావు. అయినా కంగారు పడక్కర్లేదు. కట్టని EMIలు, సెటిల్ చేసిన ఖాతా వివరాల రిపోర్ట్‌లో 7 ఏళ్ల వరకు ఉన్నా స్కోర్‌ను పెంచేసుకోవచ్చు.
మీరు లేటుగా కట్టిన EMIలు, సెటిల్ చేసిన అకౌంట్లు, రద్దు చేసిన లోన్ల వల్ల మీ CIBIL రిపోర్ట్‌లో 7 ఏళ్ల వరకు ఉంటుంది. దివాలా తీసినప్పుడు ఇది ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చు. అయితే CIBIL మోడల్స్ అనేవి పాత తప్పుల కన్నా, మీ ప్రస్తుత ఆర్థిక లావాదేవీలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ వల్ల త్వరగానే కోలుకోవచ్చు.
24
ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి
ఆలస్యంగా కట్టిన EMI (నెల రోజుల ఆలస్యం): ఇది మీ స్కోర్‌ను వెంటనే 50 నుంచి 100 పాయింట్ల వరకు తగ్గిస్తుంది. కానీ రాబోయే 6 నెలల నుంచి ఏడాది వరకు వాయిదాలు కరెక్ట్‌గా కడితే, కోల్పోయిన పాయింట్లను తిరిగి పొందవచ్చు.
సెటిల్డ్ అకౌంట్: బ్యాంకులతో మాట్లాడి, అసలు కన్నా తక్కువ మొత్తం చెల్లించి అకౌంట్ క్లోజ్ చేయడం వల్ల మీరు డీల్‍ను బ్రేక్ చేశారని అర్థమవుతుంది. ఈ 'Settled' మార్క్ రిపోర్ట్‌లో 7 ఏళ్లు ఉంటుంది. సో డబ్బు ఇచ్చే సంస్థల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మినిమమ్ 18 నెలల నుంచి 3 ఏళ్ల వరకు పడుతుంది.
డీఫాల్ట్, రైట్-ఆఫ్: మీరు కట్టాల్సిన లోన్‌ను నష్టాల ఖాతాలో రాస్తే, మీ స్కోర్ 500 కంటే కిందకు పడిపోతుంది. మళ్లీ నమ్మకాన్ని సంపాదించి, స్కోర్‌ను 700 పైకి తీసుకెళ్లడానికి 3 నుంచి 5 ఏళ్ల ప్రయత్నం చాలా అవసరం.
34
స్కోర్ పెంచుకోవడానికి ప్రాక్టికల్ వే..
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్: బ్యాంకులో డిపాజిట్ చేసి, దానిపై కార్డ్ తీసుకోండి. దాన్ని వాడుతూ, ప్రతి నెలా మొత్తం బకాయి లేకుండా కడితే, 12-18 నెలల్లో మంచి పేమెంట్ హిస్టరీ వస్తుంది.
క్రెడిట్ మిక్స్: ఒక చిన్న పర్సనల్ లోన్ తీసుకుని, దాన్ని సరైన వాయిదాల్లో తిరిగి చెల్లించండి. ఇది వివిధ రకాల అప్పులను మీరు మేనేజ్ చేయగలరని చూపి, స్కోర్‌ను పెంచుతుంది.
వాడుకం పరిమితి: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో ఎప్పుడూ 30% లోపే వాడండి. అలాగే, తక్కువ సమయంలో ఎక్కువ లోన్ల కోసం అప్లై(హార్డ్ ఎంక్వైరీ) చేయడం ఆపండి.
ప్రతి 3 నెలలకు ఒకసారి మీ CIBIL రిపోర్ట్‌ను ఫ్రీగా చెక్ చేసుకోండి. అందులో బ్యాంకు తప్పుల వల్ల ఏవైనా తప్పుడు నెగెటివ్ ఎంట్రీలు ఉంటే, వెంటనే CIBIL సైట్‌లో కంప్లైట్ చేసి సరిచేయించుకోండి. ఇది మీ రికవరీ సమయాన్ని బాగా తగ్గిస్తుంది. 30 లేదా 60 రోజుల్లో స్కోర్‌ను సరిచేస్తామని చెప్పే ఏజెన్సీల మాటలు నమ్మకండి, అవి ఫేక్ అయి ఉండొచ్చు. సో పాత మిస్టేక్స్ ని సరిదిద్దలేం, ఆర్థిక క్రమశిక్షణ వల్ల మాత్రమే ప్రభావాన్ని తగ్గించగలరు. ఓపికగా బిల్లులు కట్టాలి, తెలివైన అప్పుల నిర్వహణే CIBIL స్కోర్‌ను పెంచుకోవడానికి అసలైన, స్థిరమైన మార్గం.