FD: మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉందా? ఏదైనా బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారా? మంచి ఆలోచనే.. కానీ ఒక్కసారి తెలుసుకోండి. సరైన పద్దతిలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నామా లేదా అని? ముఖ్యంగా 4 పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి.
ఇండియాలో డబ్బులు పొదుపు చేయడానికి, సురక్షితమైన రాబడి పొందడానికి అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాల్లో 'ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)' ఒకటి. అయితే, చాలామంది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎఫ్‌డీలు చేసేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో లాభం పొందలేకపోవడమే కాకుండా, అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేసేటప్పుడు చేయకూడని 4 ముఖ్యమైన తప్పులు, వాటి అధికారిక నిబంధనల గురించి తెలుసుకుందాం.
25
మొత్తం డబ్బును ఒకే ఎఫ్‌డీలో డిపాజిట్ చేయడం
చాలామంది తమ వద్ద ఉన్న పెద్ద మొత్తాన్ని (ఉదాహరణకు ₹5 లక్షలు) ఒకే ఖాతాలో లేదా ఒకే కాలపరిమితికి డిపాజిట్ చేస్తుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. ఎఫ్‌డీని ఎప్పుడూ ఒకే ఖాతాలో పెట్టకుండా వివిధ కాలపరిమితులతో (1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు) లేదా వేర్వేరు బ్యాంకుల్లో విభజించి డిపాజిట్ చేయడం (FD Laddering) మంచిది. దాని వల్ల ప్రయోజనం ఏంటంటే? అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు పూర్తి ఎఫ్‌డీని రద్దు చేయకుండా, కొంత భాగాన్ని మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల పెనాల్టీ భారం తగ్గుతుంది.
35
ఆటో-రెన్యూవల్ (Auto-Renewal) ఆప్షన్‌ను సరిగ్గా గమనించకపోవడం
డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత బ్యాంకు దానంతట అదే మళ్లీ అదే కాలపరిమితికి డిపాజిట్‌ను రెన్యూవల్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. డిపాజిట్ మెచ్యూరిటీ సమయానికి మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినా లేదా తగ్గినా, పాత డిపాజిట్ ఆటో-రెన్యూవల్ అయితే ఆ సమయానికి ఉన్న సాధారణ రేటే వర్తిస్తుంది. అందుకే.. మెచ్యూరిటీకి ముందే వడ్డీ రేట్లను పరిశీలించి, ఇతర బ్యాంకుల్లో మంచి వడ్డీ వస్తుంటే నిధులను రీ-ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సబ్సిడీ సంస్థ అయిన 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్' (DICGC) నిబంధనల ప్రకారం, ఒక బ్యాంకులోని మీ డిపాజిట్లకు (అసలు + వడ్డీ కలిపి) గరిష్టంగా ₹5 లక్షల వరకు మాత్రమే భద్రత ఇన్సూరెన్స్ లభిస్తుంది. మీ వద్ద పెద్ద మొత్తంలో నిధులు ఉంటే, ఒకే బ్యాంకులో ₹5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయకుండా, వేర్వేరు బ్యాంకుల్లో (సహకార లేదా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు) విభజించి పెట్టుబడి పెట్టాలి. దీనివల్ల ఏదైనా బ్యాంకు ఆర్థిక సమస్యల్లోకి వెళ్లినా మీ డబ్బుకు 100% రక్షణ ఉంటుంది.
55
పన్ను మినహాయింపు ఫారాలు సమర్పించకపోవ
ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం నిర్దిష్ట పరిమితి దాటితే బ్యాంకులు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 'పన్ను మినహాయింపు' (TDS) చేస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం సాధారణ పౌరులకు ₹40,000, సీనియర్ సిటిజన్లకు ₹50,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే మీ మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిమితిలోకి రానట్లయితే, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఫారమ్ 15G (సాధారణ పౌరులు) లేదా ఫారమ్ 15H (60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు) సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అనవసరంగా టీడీఎస్ కట్ కాకుండా చూసుకోవచ్చు. జాగ్రత్త పడండి.. మీ కష్టార్జితాన్ని బ్యాంకు ఎఫ్‌డీల్లో భద్రపరుచుకునేటప్పుడు ఈ 4 నిబంధనలను దృష్టిలో ఉంచుకోవడం వల్ల పన్ను ఆదా అవ్వడమే కాకుండా, గరిష్ట రాబడి తో పాటు ఆర్థిక భద్రత లభిస్తాయి.