వేల రూపాయల చిమ్నీ అవసరం లేదు.. త‌క్కువ ధ‌ర‌లోనే వంటింటి పొగ, వాసనకు చెక్ పెట్టొచ్చు

Published : Aug 07, 2026, 10:12 PM IST

Exhaust Fan: వంట చేస్తున్నప్పుడు వ‌చ్చే పొగ‌, నూనె వాస ఇబ్బంది పెడుతుంది. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చిమ్నీలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే చిమ్నీల ధ‌ర‌లు వేలల్లో ఉంటాయి. కానీ తక్కువ ధరలోనే మినీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు ఉన్నాయి.

PREV
15
చిమ్నీకి బదులుగా తక్కువ ఖర్చుతో మంచి ప్రత్యామ్నాయం

సాధారణ కిచెన్ చిమ్నీల ధరలు రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటాయి. వాటిని అమర్చేందుకు అదనపు ఖర్చు కూడా ఉంటుంది. కానీ ఈ మినీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ చిన్న పరిమాణంలో ఉండి, తక్కువ ఖర్చుతోనే వంట సమయంలో వచ్చే పొగ, వాసన, ఆవిరిని బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

25
చిన్నదే కానీ పనితీరు మాత్రం బలంగా ఉంటుంది

ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లో అడ్జస్టబుల్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఫ్యాన్ వేగాన్ని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. తక్కువ వేగంలో నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఎక్కువ వేగంలో వంటగదిలోని పొగ, వాసనను వేగంగా బయటకు పంపిస్తుంది. చిన్న కిచెన్లు, హాస్టల్ గదులు, స్టూడియో అపార్ట్‌మెంట్లకు ఇది మంచి ఎంపిక. అందులోనూ ఇందుకోసం ప్ర‌త్యేకంగా గోడ‌కు ఎలాంటి రంధ్రం చేయాల్సి ప‌నిలేదు. పోర్ట‌బుల్‌గా గోడ‌కు త‌గిలిస్తే స‌రిపోతుంది.

35
USBతో పనిచేస్తుంది.. ఎక్కడైనా ఉపయోగించొచ్చు

ఈ మినీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది USB పవర్‌తో పనిచేస్తుంది. పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్, మొబైల్ ఛార్జర్ అడాప్టర్ వంటి USB సపోర్ట్ ఉన్న పరికరాలకు కనెక్ట్ చేసి ఉపయోగించవచ్చు. ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ అవసరం ఉండదు. అందువల్ల అవసరమైతే ఒక చోటు నుంచి మరో చోటుకు సులభంగా తీసుకెళ్లవచ్చు.

45
వంటగదికే కాదు.. ఇత‌ర చోట్ల కూడా ఉపయోగం

ఈ ఫ్యాన్‌ను కేవలం వంటగదిలో మాత్రమే కాదు, బాత్రూమ్‌లో తేమ, దుర్వాసన తొలగించేందుకు, చిన్న వర్క్‌షాప్‌లలో గాలి ప్రసరణ మెరుగుపరచేందుకు, స్టోర్‌రూమ్‌లు, చిన్న గదుల్లో గాలి మార్పిడి కోసం కూడా ఉపయోగించవచ్చు. అందువల్ల ఒకే పరికరాన్ని పలు అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

55
ధర ఎంతంటే.?

ఈ మినీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అసలు ధర రూ. 5,067. ప్రస్తుతం అమెజాన్‌లో 53 శాతం డిస్కౌంట్తో కేవలం రూ. 2,404కే లభిస్తోంది. తక్కువ ఖర్చుతో వంటింటి పొగ, వాసన సమస్యను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఖరీదైన చిమ్నీ కొనలేని వారు లేదా అద్దె ఇంట్లో ఉండి శాశ్వతంగా చిమ్నీ ఏర్పాటు చేయలేని వారికి ఈ చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగపడుతుంది.

గమనిక: ఈ మినీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పూర్తి స్థాయి కిచెన్ చిమ్నీకి ప్రత్యామ్నాయం కాదు. అయితే చిన్న కిచెన్లు, అద్దె ఇళ్లు, హాస్టళ్లు, తక్కువ పొగ వచ్చే వంటల కోసం సరసమైన ధరలో ల‌భించే బెస్ట్ సొల్యుష‌న్‌గా మాత్రం చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories