
DMart : భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు డీమార్ట్... తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందించే ఈ సూపర్ మార్కెట్ మధ్యతరగతి ప్రజలకు బాగా చేరువయ్యింది. ఇలా దేశంలోని మెజారిటీ మిడిల్ క్లాస్ వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తుండటంతో డీమార్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రత్యర్థి సూపర్ మార్కెట్స్ నష్టాలపాలై మూతపడుతున్నా డీమార్ట్ మార్ట్ మరింత వేగంగా విస్తరిస్తోంది... వేలకోట్ల వ్యాపారాన్ని చేస్తోంది.
ఇలా రిటైల్ వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించిన డిమార్ట్ స్టోర్లు ప్రస్తుతం భారతదేశంలోని అనేక నగరాల్లో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే కారణంగానే ప్రజలు ఎక్కువగా డీమార్ట్ లో షాపింగ్ ను ఇష్టపడుతున్నారు. అయితే వినియోగదారుల మాదిరిగానే చిన్న వ్యాపారవేత్తలకు కూడా డీమార్ట్ ఒక శుభవార్త అందిస్తోంది. తమ ఉత్పత్తులను డీమార్డ్ లో అమ్ముకోవాలంటే వ్యాపారవేత్తలు నిశ్చింతగా ఆపని చేయవచ్చు... ఇలా డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేసి మంచి లాభాలను పొందవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
డిమార్ట్ అన్ని స్టోర్లలో ఆహారం, గృహోపకరణాలు, కిరాణా, దుస్తులు వంటి అనేక రకాల వస్తువులను అమ్ముతోంది. దీనివల్ల స్థానిక ఉత్పత్తిదారులు లేదా చిన్న వ్యాపారులు తమ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు మీరు మసాలా దినుసులు, ప్యాకెట్ ఫుడ్, ప్లాస్టిక్ వస్తువులు, టీ-షర్టులు లేదా రోజువారీ ఉపయోగించే వస్తువులను తయారుచేస్తుంటే, డిమార్ట్ మీ వస్తువులను వినియోగదారులకు చేరవేయడంలో సహాయపడుతుంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరున్న బ్రాండ్సే కాదు లోకల్ వస్తువులు కూడా డీమార్ట్ లో లభిస్తాయి. అయితే మీరు ఏదైనా వస్తువు తయారుదారు అయితే దాన్ని డీమార్ట్ లో అమ్ముకోవచ్చు. ఇందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం మీరు ఉత్పత్తిచేసే వస్తువుల వివరాలతో పాటు మీ పర్సనల్ డిటెయిల్స్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. డీమార్ట్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఈ పని చేయాలి. ఇక్కడ వ్యాపారి తన కంపెనీ వివరాలతో పాటు డీమార్ట్ లో అమ్మాలనుకునే ప్రోడక్ట్ డిటెయిల్స్ అందించాలి.
ఇలా దరఖాస్తు చేసుకున్న వ్యాపారులను డీమార్ట్ అధికారులు సంప్రదిస్తారు. ప్రతి మంగళవారం డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేయాలనుకునేవారితో సమావేశం అవుతారు అధికారులు. వీరి వస్తువుల నాణ్యత, ధర, ఇతర వివరాలను తెలుసుకుంటారు. ఇలా ఇద్దరూ ఓ ఒప్పందానికి వస్తే ఆ వస్తువు డీమార్ట్ లో అమ్మకానికి పెడతారు... వినియోగదారులకు ఆ వస్తువు మరింత దగ్గర అవుతుంది. ఇలా డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేయడంద్వారా మంచి లాభాలను పొందవచ్చు.
డీమార్ట్ తో వ్యాపారం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకొండి.
మీ వస్తువులు వినియోగదారుల వరకు చేర్చేందుకు డీమార్ట్ మంచి ప్లాట్ ఫామ్ కల్పిస్తోంది. ఉత్పత్తిదారులతో చేయిచేయి కలిసి ఎదగాలన్నదే డీమార్ట్ బిజినెస్ సీక్రెట్. మంచి క్వాలిటీ వస్తువులను అందించేవారితో లాంగ్ టర్మ్ పార్టనర్ షిప్ కొనసాగిస్తామని డీమార్ట్ చెబుతోంది. ఇలా డీమార్ట్ తో చేతులుకలిసి వ్యాపారాన్ని మరింత పెంచుకునే అవకాశం వచ్చింది.. దీన్ని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. ఇది వ్యాపారాన్ని రాష్ట్రవ్యాప్తంగా, తదుపరి దశలో దేశవ్యాప్తంగా విస్తరించడానికి సహాయపడుతుంది.
డిమార్ట్ తన వినియోగదారులకు ఎల్లప్పుడూ నమ్మకమైన, నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకే అందించాలని కోరుకుంటుంది. అందువల్ల డీమార్ట్ తో వ్యాపారం చేయాలనుకునేవారు కూడా అదే ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది... అంటే వారి వస్తువులు బయట మార్కెట్ కంటే తక్కువధరలో ఉండాలి. ముఖ్యంగా ఆహారం, కిరాణా వస్తువుల నాణ్యత చాలా ముఖ్యం. నాణ్యతా ధ్రువపత్రాలు లేకుండా డిమార్ట్ వస్తువుల అమ్మకానికి అంగీకరించదు. ఇది వినియోగదారుల నమ్మకాన్ని కాపాడే ప్రయత్నం.
చిన్న వ్యాపారవేత్తలకు ఇది చాలా పెద్ద అవకాశం. సాధారణ దుకాణాలు లేదా ఆన్‌లైన్ మార్కెట్‌లో పోటీ పడటం కష్టంగా ఉండే పరిస్థితుల్లో, డిమార్ట్ వంటి పెద్ద రిటైల్ చైన్ మీ వస్తువులకు ఖచ్చితమైన మార్కెట్‌ను సృష్టిస్తుంది. మీ వస్తువులు వినియోగదారులకు చేరుతాయి. అందువల్ల మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటే, డిమార్ట్ వంటి పెద్ద కంపెనీలతో కలిసి పనిచేయడం ఉత్తమ పరిష్కారం. నాణ్యత, ధర, నమ్మకాన్ని కాపాడుకుంటే మీరు కూడా త్వరలోనే ప్రముఖ వ్యాపారిగా మారవచ్చు.
తాము సొంతంగానే వ్యాపారాలు చేస్తామని... ఎవరికీ ఫ్రాంచైజీలు ఇవ్వడంలేదని డీమార్ట్ స్పష్టం చేస్తోంది. ఇలా డీమార్ట్ ఫ్రాంచైజీ పేరిట ఎవరైనా సంప్రదిస్తే నమ్మవద్దని సూచిస్తోంది. అవసరమైన భూమిని కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకుని స్టోర్ట్స్ ఏర్పాటుచేస్తామే తప్ప ఫ్రాంచైజీలు ఇవ్వబోమని డీమార్ట్ స్పష్టం చేస్తోంది. అలాగే వ్యాపారులు తమ వస్తువులు డీమార్ట్ స్టోర్స్ లో అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది.
అయితే డీమార్ట్ మార్కెట్ చాలా విస్తృతమైంది... అందుకే దీని పేరును వాడుకునే ప్రయత్నాలు మార్కెట్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. సేమ్ ఈ పేరును పోలి ఏ మార్ట్, బి మార్ట్, సి మార్ట్ వంటి సూపర్ మార్కెట్లు వెలుస్తున్నాయి... వీటితో డీమార్ట్ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకే ఎలాంటి ఫ్రాంచైజీలు ఇవ్వడంలేదని డీమార్ట్ స్పష్టం చేస్తోంది.