Reliance AGM 2025 Key Highlights: రిలయన్స్ ఏజీఎం 2025లో జియో ఐపీవో, ఏఐ భాగస్వామ్యాలు, FMCG లక్ష్యాలు, గ్లోబల్ విస్తరణ సహా పలు అంశాలపై ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు.
రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (Reliance AGM 2025)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)ను శుక్రవారం (2025 ఆగస్టు 29న) నిర్వహించింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ షేర్‌హోల్డర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు కీలక ప్రకటనలు చేశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి దశలో ఉన్నప్పటికీ, 21వ శతాబ్దం "సువర్ణ యుగం" వైపు అడుగులు వేస్తుందని చెప్పారు. సంస్థ అద్భుతమైన ప్రయాణం చేస్తోందన్నారు.
DID YOU KNOW ?
దేశంలో అతిపెద్ద టెలికాం జియో
జియో అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో అత్యధిక సబ్స్క్రైబర్లను సంపాదించి, నంబర్ 1 టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. 2025 నాటికి జియో 500 మిలియన్ల కస్టమర్లను దాటింది, ఇది టెలికాం రంగంలో ఒక పెద్ద మైలురాయి.
26
జియో ఐపీవో ప్రణాళికలపై ముఖేష్ అంబానీ వ్యాఖ్యలు
AGMలో అత్యంత ముఖ్యమైన ప్రకటన జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీవో. అంబానీ వెల్లడించిన ప్రకారం, జియో 2026 మొదటి అర్ధభాగంలో (H1CY26) షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ కానుంది. జియో IPO భారతదేశంలోనే అతిపెద్ద ఇష్యూ అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 66.5% వాటా ఉంది.
జియో ఇప్పటికే 500 మిలియన్ కస్టమర్లను సాధించి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పేర్కొన్నారు.
36
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో భారీ పెట్టుబడులు
భవిష్యత్తులో AI కీలక పాత్ర పోషిస్తుందని ముఖేష్ అంబానీ చెప్పారు. గూగుల్‌తో భాగస్వామ్యంలో జామ్‌నగర్‌లో AI క్లౌడ్ రీజియన్ ఏర్పాటు కానుంది. మెటాతో కలసి ఓపెన్ సోర్స్ AI మోడల్స్ ను అభివృద్ధి చేసి చిన్న వ్యాపారాలకు అందించనున్నారు.
ఇందుకోసం కొత్తగా రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే సబ్సిడియరీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. AI డేటా సెంటర్లు నిర్మించడం, గ్లోబల్ భాగస్వామ్యాలు, సులభమైన AI సేవలు అందించడం, ప్రపంచ స్థాయి AI ప్రతిభను పెంపొందించడం దీని లక్ష్యాలుగా ఉన్నాయి.
రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL)ను RIL నేరుగా అనుబంధ సంస్థగా మార్చనున్నట్లు అంబానీ ప్రకటించారు. గత 3 ఏళ్లలో RCPL రూ.11,500 కోట్ల రెవెన్యూ సాధించింది. వచ్చే 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్లు రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకున్నారు. FMCGతో పాటు వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర విభాగాల్లోనూ విస్తరించనున్నట్లు వెల్లడించారు.
56
రిలయన్స్ భవిష్యత్ వృద్ధి ప్రణాళికలు
2028 నాటికి కంపెనీ EBITDAను రెట్టింపు చేస్తామని ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ ఇంటెలిజెన్స్, RCPL వంటి కొత్త వ్యాపారాలు భవిష్యత్ వృద్ధికి ఇంజన్లుగా నిలుస్తాయని చెప్పారు. కొత్త ఎనర్జీ బిజినెస్ వచ్చే ఐదేళ్లలో ఆయిల్-టు-కెమికల్స్ విభాగం కంటే పెద్దదిగా ఎదుగుతుందని చెప్పారు.
66
రిలయన్స్ ఆర్థిక ప్రగతి 2025
మొత్తం ఆదాయం: రూ. 10.71 లక్షల కోట్లు
EBITDA: రూ. 1.83 లక్షల కోట్లు
నికర లాభం: రూ. 81,309 కోట్లు
ప్రభుత్వానికి చెల్లింపులు: రూ. 2.10 లక్షల కోట్లు
ఉద్యోగులు: 6.8 లక్షలు (త్వరలో 10 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది)