DMart : మీ స్థలంలోనే డీమార్ట్ పెట్టవచ్చు.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?

Published : Aug 26, 2025, 08:05 PM IST

మీ సొంత స్థలంలో డీమార్ట్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ అవకాశం ఇప్పుడు మీ ముందుంది. ఇందుకోసం మీరు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకొండి.

PREV
15
విస్తరణకు సిద్దమైన డీమార్ట్

DMart : భారత ప్రజలకు మరీముఖ్యంగా పేద, మధ్యతరగతి వారికి అతి తక్కువ కాలంలో చాలా దగ్గరయ్యింది ఈ డీమార్ట్. గత రెండున్నర దశాబ్దాలుగా దేశంలో ఈ డీమార్ట్ ప్రయాణం కొనసాగుతోంది... సుదీర్ఘ కాలంగా ఇక్కడే నిత్యావసర వస్తువులు కొంటుండటంతో వినియోగదారులకు దీంతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది... దీంతో ఇది ఓ సూపర్ మార్కెట్ లా కాదు తమ గల్లీ చివర్లోని కిరాణా దుకాణంలా భావిస్తుంటారు. ఇలా రోజురోజులకు ప్రజల్లో డీమార్ట్ పై నమ్మకం పెరుగుతుండటంతో వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది... పోటీ సంస్థలు గిరాకీ లేక మూతపడుతుంటే డీమార్ట్ విజయపరంపర కొనసాగుతోంది.

ఇప్పటికే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్దపెద్ద నగరాల్లోనే డీమార్ట్ వ్యాపారాన్ని విస్తరించింది. అక్కడ పెద్దగా స్కోప్ లేదు... కాబట్టి ఇప్పుడు చిన్నచిన్న పట్టణాలపై దీని కన్నుపడింది. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ వంటి నగరాల్లో డీమార్ట్ అడుగుపెట్టింది. ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సిద్దమై స్థలాల వేట ప్రారంభించింది... అనుకూలమైన స్థలం దొరికితే వెంటనే సూపర్ మార్కెట్, గోదాంతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు డీమార్ట్ సిద్దమయ్యింది.

25
మీ స్థలంలో డీమార్డ్ పెట్టే అవకాశం...

డీమార్ట్ ను మరింతలా విస్తరించేందుకు సిద్దమయ్యారు... అయితే ఇందుకోసం భారీగా భూములు అవసరం అవుతాయి. అందుకే తమ భూములను వ్యాపార కార్యకలాపాలకోసం అప్పగించేందుకు ఆసక్తి చూపించే భూయజమానులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇలా మీ భూమిలో డీమార్ట్ రావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే అప్లై చేసుకొండి.

భూమిని రెంట్ కు తీసుకుని డెవలప్ చేసుకోడానికైనా... లేదంటే అమ్మేందుకు సిద్దంగా ఉన్నా కొనుగోలు చేయడానికి డీమార్ట్ సిద్దంగా ఉంది. ఇలా భూయజమానులు తమకు నచ్చిన పద్దతిలో భూమిని అప్పగించవచ్చని డీమార్ట్ పేర్కొంది. వ్యక్తిగత వివరాలతో పాటు భూమికి సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. భూయజమానులను డీమార్ట్ ప్రతినిధులు సంప్రదిస్తారు. అన్నీ కుదిరితే మీ భూమిలోనే డీమార్ట్ రావచ్చు.

డీమార్ట్ కు భూమి అప్పగించాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకొండి. 

35
మీ వస్తువులను డీమార్ట్ లో అమ్ముకోండిలా..

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరున్న బ్రాండ్సే కాదు లోకల్ వస్తువులు కూడా డీమార్ట్ లో లభిస్తాయి. అయితే మీరు ఏదైనా వస్తువు తయారుదారు అయితే దాన్ని డీమార్ట్ లో అమ్ముకోవచ్చు. ఇందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం మీరు ఉత్పత్తిచేసే వస్తువుల వివరాలతో పాటు మీ పర్సనల్ డిటెయిల్స్ తో దరఖాస్తు చేసుకోవచ్చు.

మీ వస్తువులు వినియోగదారుల వరకు చేర్చేందుకు డీమార్ట్ మంచి ప్లాట్ ఫామ్ కల్పిస్తోంది. ఉత్పత్తిదారులతో చేయి కలిసి కలిసి ఎదగాలన్నదే డీమార్ట్ బిజినెస్ సీక్రెట్. మంచి క్వాలిటీ వస్తువులను అందించేవారితో లాంగ్ టర్మ్ పార్టనర్ షిప్ కొనసాగిస్తామని డీమార్ట్ చెబుతోంది. ఇలా డీమార్ట్ తో చేతులుకలిసి వ్యాపారాన్ని మరింత పెంచుకునే అవకాశం వచ్చింది.. దీన్ని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి.

45
డీమార్ట్ ఫ్రాంచైజీలు ఇవ్వదు.. నమ్మి మోసపోకండి

తాము సొంతంగానే వ్యాపారాలు చేస్తామని... ఎవరికీ ఫ్రాంచైజీలు ఇవ్వడంలేదని డీమార్ట్ స్పష్టం చేస్తోంది. ఇలా డీమార్ట్ ఫ్రాంచైజీ పేరిట ఎవరైనా సంప్రదిస్తే నమ్మవద్దని సూచిస్తోంది. అవసరమైన భూమిని కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకుంటాము తప్ప ఫ్రాంచైజీలు ఇవ్వబోమని డీమార్ట్ స్పష్టం చేస్తోంది.

అయితే డీమార్ట్ మార్కెట్ చాలా విస్తృతమైంది... అందుకే దీని పేరును వాడుకునే ప్రయత్నాలు మార్కెట్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. సేమ్ ఈ పేరును పోలి ఏ మార్ట్, బి మార్ట్, సి మార్ట్ వంటి సూపర్ మార్కెట్లు వెలుస్తున్నాయి... వీటితో డీమార్ట్ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకే ఎలాంటి ఫ్రాంచైజీలు ఇవ్వడంలేదని డీమార్ట్ స్పష్టం చేస్తోంది.

55
డీమార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే..

బయట మార్కెట్లో లభించే ధరలకంటే తక్కువకే వస్తువులను అందిస్తుంటుంది డీమార్ట్. ఇంకా చెప్పాలంటే కొన్ని వస్తువులను తయారీదారులు నిర్ణయించిన MRP కంటే తక్కువకే అందిస్తుంది. దీంతో వినియోగదారుల అతి తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి... తద్వారా డబ్బులు సేవ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడికే వెళతారు… ఇలా డీమార్ట్ కస్టమర్లు రోజురోజులు మరింత పెరుగుతున్నారు.

తయారీదారుల నుండి ఒకేసారి భారీగా కొనుగోలు చేయడంతో డీమార్ట్ కు కొంత తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి. ఇక తక్కువ లాభాలు చూసుకుని అమ్మకానికి పెడుతుంది. ఇదే డీమార్ట్ అతి తక్కువ ధరకు వస్తువులు అందించే బిజినెస్ సీక్రెట్. తక్కువ లభాలున్నా ఎక్కువమొత్తంలో అమ్ముతుంది కాబట్టి డీమార్ట్ కు గిట్టుబాటు అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories