IRCTC: రైలు ఎక్కే ప్ర‌తీ ఒక్క‌రూ ఈ ప‌ని చేయాల్సిందే.. IRCTCని రైల్‎వన్‌తో లింక్ చేశారా, లేదా?

Published : Jul 13, 2025, 09:41 AM IST

అన్ని రంగాల్లో టెక్నాల‌జీ అనివార్యంగా మారిన క్ర‌మంలోనే ఇండియ‌న్ రైల్వేస్ సైతం డిజిట‌లైజేష‌న్‌ను అందిపుచ్చుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా రైల్‌వ‌న్ పేరుతో ఓ యాప్‌ను తీసుకొచ్చింది. 

PREV
15
అన్ని సేవ‌లు ఒకే యాప్‌లో

రైలు టికెట్ బుకింగ్ మాత్ర‌మే కాకుండా ట్రైన్ లైవ్ స్టేట‌స్‌, పీఎన్‌ఆర్ స్టేట‌స్‌, ప్లాట్‌ఫాం వివరాలు వంటి అనేక విష‌యాలు ఒకే చోట తెలుసుకునేందుకు ఇండియ‌న్ రైల్వే కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. 

రైల్ వ‌న్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌కు మీ IRCTC ఖాతాను లింక్ చేసి, అన్నిరకాల రైలు సేవలను ఒకే వేదికలో పొందవచ్చు.

25
RailOne యాప్ అంటే ఏంటి?

RailOne అనేది భారతీయ రైల్వే ప్రయాణికుల అవసరాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్. ఇది టికెట్ బుకింగ్, పీఎన్‌ఆర్ చెక్, రైలు లైవ్ స్టేట‌స్‌, స్టేషన్ నోటిఫికేషన్లు, ప్లాట్‌ఫాం సమాచారం వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. 

పలు ఇతర యాప్స్ అందించే సేవలను ఇది ఒకే చోట సమర్ధవంతంగా అందించడం దీని ప్రత్యేకత. దీంతో ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, సమయాన్ని ఆదా చేయొచ్చు.

35
IRCTC ఖాతాను RailOne తో లింక్ చేయడం ఎలా?

* ఇందుకోసం ముందుగా మీ మొబైల్‌ఫోన్‌లో RailOne యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* యాప్‌ను ఓపెన్ చేసి, కొత్త ఖాతా నమోదు చేయండి లేదా ఇప్పటికే ఉన్న ఖాతాతో లాగిన్ అవ్వండి

* హోమ్ స్క్రీన్‌లో IRCTC లింక్ చేసే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

* మీ IRCTC యూజ‌ర్ నేమ్‌, పాస్‌వర్డ్ నమోదు చేయండి

* ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేసిన తరువాత, మీ ఖాతా విజయవంతంగా లింక్ అవుతుంది

* ఒక్కసారి లింక్ చేస్తే, ఇకపై మీరు టిక్కెట్ బుకింగ్‌కు ప్రత్యేకంగా IRCTCలో లాగిన్ అయ్యే అవసరం ఉండదు.

45
ఈ యాప్ ఉప‌యోగాలు ఏంటంటే.?

* టికెట్ బుకింగ్, పీఎన్‌ఆర్ చెక్, రైలు షెడ్యూల్ వంటి సేవలు వేగంగా లభిస్తాయి

* మీ బుకింగ్ హిస్టరీ, లైవ్ ట్రైన్ స్టేటస్ వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి

* రైలు ఆలస్యాలు, ప్లాట్‌ఫాం మార్పులు వంటి సమాచారాన్ని మీరు తక్షణమే తెలుసుకోగలుగుతారు

* టెక్నాలజీపై అనుభవం తక్కువగా ఉన్నవారు కూడా సులభంగా ఉప‌యోగించేలా దీని ఇంట‌ర్ ఫేజ్‌ను రూపొందించారు.

* IRCTCతో లింక్ చేసుకున్న త‌ర్వాత, ప్రతి సారి లాగిన్ కావాల్సిన అవసరం ఉండదు

55
భ‌ద్ర‌త‌కు పెద్ద పీట

మీ డేటా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా RailOne యాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. ఇది IRCTC నిబంధనలతో స‌మానంగా పనిచేస్తోంది. ట్రాన్సాక్షన్‌లు, వ్యక్తిగత వివరాల పరంగా ఎలాంటి రిస్క్ లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. ఈ యాప్‌ ద్వారా మీరు పూర్తి నమ్మకంతో సేవలు పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories