ప్రపంచంలోని టాప్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గా గుర్తింపు పొందిన యూట్యూబ్ తాజాగా తన యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) కి సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది.
జూలై 15 నుండి కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం డూప్లికేట్ కంటెంట్ లేదా కాపీ చేసిన కంటెంట్‌కు ఇకపై యూట్యూబ్ ఆదాయం చెల్లించదు.
26
ఇకపై కాపీ వీడియోలకు ఆదాయం ఉండదు
యూట్యూబ్ అధికార వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. మానిటైజేషన్ పొందాలంటే వీడియోలు అసలైనవి, ఒరిజినల్ కావాల్సిందే. ఇతరుల వీడియోలను ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడం, ఏఐ ద్వారా తయారుచేసిన స్లయిడ్ షోలను పోస్ట్ చేయడంతో వాటికి ఇకపై ఆదాయం రాదు.
యూట్యూబ్ లో ఆదాయానికి అర్హతలేని వీడియోలు ఇవే
• క్లోన్ లేదా డూప్లికేట్ వీడియోలు
• లో-క్వాలిటీ వీడియో కంటెంట్
• క్లిక్‌బైట్ ఆధారిత వీడియోలు
• కాపీ చేసిన, చిన్న మార్పులతో తిరిగి వాడిన వీడియోలు
36
యూట్యూబ్ కొత్త పాలసీ ఉద్దేశం ఏంటి?
యూట్యూబ్ ప్రకారం, ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం అసలైన కంటెంట్‌ను ప్రోత్సహించడం. ప్లాట్‌ఫామ్ ద్వారా ఏఐ కంటెంట్ కు చెక్ పెట్టడం. అలాగే, మానవ కృషిని ఆదరించడమే కాకుండా, ఇతరుల కంటెంట్‌ను అనవసరంగా వాడి ఆదాయం పొందే పరిస్థితులను అరికట్టే దిశగా చర్యలుగా ఉన్నాయి.
క్రియేటివిటీ లేకుండా తయారైన వీడియోలు, ఏఐ ఆధారిత కంటెంట్, మాస్ ప్రోడ్యూస్ చేసిన వీడియోలు.. ఇవన్నీ యూట్యూబ్ లో ఇక ఆదాయానికి అర్హత ఉండదు.
యూట్యూబ్ మానిటైజేషన్ కోసం క్రియేటర్లు ఈ ప్రమాణాలు కలిగి ఉండాలి:
• కనీసం 1,000 సబ్‌స్క్రైబర్లు. అలాగే,
• గత 12 నెలల్లో 4,000 గంటల పబ్లిక్ వాచ్ టైం
లేదా
• గత 90 రోజుల్లో 1 కోటి షార్ట్ వ్యూస్
ఈ ప్రమాణాలు పూర్తయిన తర్వాత, వీడియో కంటెంట్ అసలైనదా కాదా అన్నది యూట్యూబ్ చెక్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే మీ ఛానెల్ కు మానిటైజేషన్ ఇస్తుంది.
56
యూట్యూబ్ లో ఏ విధమైన కంటెంట్‌కు ఆదాయం వుంటుంది?
జూలై 15 తర్వాత క్రింది రకాల వీడియోలు మాత్రమే ఆదాయానికి అర్హత పొందుతాయి. వాటిలో..
• విద్యా సంబంధిత వీడియోలు
• అసలైన వినోదాత్మక కంటెంట్ (మానవ క్రియేటివిటీతో తయారైనవి)
• స్వంతంగా రూపొందించిన వీడియోలు (తరచుగా రీపర్పస్ చేయని వీడియోలు)
ఏఐ ఆధారిత స్టాక్ ఫుటేజ్, టెంప్లేట్లు, వాయిస్ ఓవర్ మాత్రమే వుండే వీడియోలకు ఆదాయం ఉండదు. అలాంటి కంటెంట్ ను యూట్యూబ్ ఒప్పుకోదని పేర్కొంది.
66
యూట్యూబ్ స్టూడియోలో మరో కీలక మార్పు
జూలై 15 నుంచి "Bare Skin (Image Only)" అనే యాడ్ కేటగిరీని యూట్యూబ్ తొలగిస్తోంది. దీన్ని ఉపయోగిస్తున్న చానెల్స్ ఆగస్ట్ 15 లోపల తమ యాడ్ సెట్టింగులను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
యూట్యూబ్ తీసుకొస్తున్న ఈ మార్పులు స్పష్టంగా అసలైన కంటెంట్‌కు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించినవిగా ఉన్నాయి. 2025 జూలై 15 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది.