ఆదాయానికి తగ్గట్టుగా మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. అద్దె, కరెంటు, ఆహారం, బేసిక్ ట్రావెల్ వంటి అవసరమైన ఖర్చులకు కొంత మొత్తాన్ని పక్కన పెట్టాలి. బయట భోజనం, మూవీస్, షాపింగ్ వంటి ఖర్చులను అదుపు చేసుకోవడం మంచిది. ఆదాయంలో కనీసం 25–40 శాతం అప్పు చెల్లించడానికి ఉపయోగించాలి.
అత్యధిక వడ్డీ ఉన్న అప్పులను ముందు తీర్చాలి
అత్యధిక వడ్డీ ఉన్న అప్పులు తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో అప్పు తీసుకోవాల్సి వస్తే.. ముందుగా వాటిని తీర్చడమే మంచిది. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత లోన్లు మొదట తీర్చాలి. తర్వాత తక్కువ వడ్డీ ఉన్న బ్యాంక్ లోన్లు, వాహన లోన్లు తీర్చాలి.
ఖర్చుల నియంత్రణ
ఖర్చులు నియంత్రణలో ఉండాలంటే అవసరమైన వస్తువులే కొనుగోలు చేయాలి. నెలవారీ అదనపు ఖర్చులు కట్ చేయాలి. బయట తినడం, కాఫీలు, ఫుడ్ డెలివరీలు తగ్గించడం ఉత్తమం.