
Personal Loan: ఆర్థిక అనిశ్చితుల మధ్య అత్యవసర అవసరాలు, వ్యక్తిగత ఖర్చుల కోసం చాలా మంది పర్సనల్ లోన్స్ పై మొగ్గుచూపుతున్నారు. అలాగే.. ఈ లోన్లను తక్కువ పేపర్ వర్క్‌తో సులభంగా పొందవచ్చు. అవసరాలకు తర్వగా డబ్బు పొందగలిగే అవకాశం ఉండటంతో అందరి ఆదరణ పొందుతున్నాయి. అయితే, పర్సనల్ లోన్ తీసుకునే ముందుగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలు తెలుసుకోవడం అత్యంత అవసరం. అలాగే.. మీకు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ డాక్యుమెంట్లతో లోన్స్ పొందవచ్చు. ఆ లోన్స్ వివరాలేంటో ఓ లూక్కేండి.
ప్రస్తుతం ఇండియాలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు సుమారు 9.95% నుంచి 24% మధ్య ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు వ్యక్తిగత క్రెడిట్ స్కోర్, ఆదాయం, రీపేమెంట్ సామర్థ్యంపై ఆధారపడి మారుతాయి. ప్రధాన బ్యాంకుల తాజా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు ఈ విధంగా ఉన్నాయి:
కెనరా బ్యాంక్ :
వడ్డీ రేటు 9.95% – 15.40% ప్రాసెసింగ్ ఫీజు: 1% వరకు
యాక్సిస్ బ్యాంక్ :
వడ్డీ రేటు 9.99% – 22.00%, ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 2% వరకు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వడ్డీ రేటు 10.35% – 14.45% ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 1% వరకు
బ్యాంక్ ఆఫ్ బరోడా
వడ్డీ రేటు 10.40% – 18.20% , ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 1% వరకు
ఐసీఐసీఐ బ్యాంక్
వడ్డీ రేటు10.60% ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 2% వరకు + టాక్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వడ్డీ రేటు 10.10% – 15.10% ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 1% వరకు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
వడ్డీ రేటు 10.90% – 24.00% ప్రాసెసింగ్ ఫీజు ఫీ: రూ.6,500 వరకు
కోటక్ మహీంద్రా బ్యాంక్
వడ్డీ రేటు10.99% ప్రాసెసింగ్ ఫీజు ఫీ: 2% వరకు
ప్రాసెసింగ్ ఫీజు ఫీ అనేది లోన్ అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది.
గమనిక: 2025 జూన్‌లో RBI 0.5% రెపో రేటు తగ్గింపు కారణంగా ఈ Personal Loan వడ్డీ రేట్లలో కొంత మార్పు చోటుచేసుకుంది. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, రీపేమెంట్ కాలం ఆధారంగా వడ్డీ రేట్లు కూడా మారవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థిరమైన వేతనాలు, ఆదాయ భరోసా కారణంగా బ్యాంకుల దృష్టిలో తక్కువ రిస్క్ కేటగిరీకి చెందిన రుణ గ్రహీతలుగా పరిగణించబడ్డారు. అందువల్ల ఈ వర్గానికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో, తక్కువ డాక్యుమెంటేషన్‌తో ప్రత్యేక Personal Loan ఆఫర్లు అందిస్తున్నాయి.
లోన్ పరిమితి: రూ.50,000 నుంచి రూ.55 లక్షల వరకు (వేతన, క్రెడిట్ స్కోర్ ఆధారంగా)
డాక్యుమెంటేషన్: ఐడీ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, పే స్లిప్ మాత్రమే అవసరం
త్వరిత ఆమోదం: కొన్నిసార్లు ఒకే రోజులోనే రుణం మంజూరు
వడ్డీ రేట్లు (2025 జూన్ నాటికి): SBI: 10.30% , యూనియన్ బ్యాంక్: 10.60% , ICICI బ్యాంక్: 10.85%, HDFC బ్యాంక్: 10.90%, కోటక్ మహీంద్రా: 10.99%, PNB: 11.00%, యాక్సిస్ బ్యాంక్: 11.25%, IDBI బ్యాంక్: 12.90%
అత్యవసర ఆర్థిక అవసరాల పరిష్కారానికి వేగవంతమైన, సులభమైన మార్గం పర్సనల్ లోన్స్. అయితే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలు బాగా తెలుసుకుని, మీ క్రెడిట్ ప్రొఫైల్‌కు సరిపోయే బ్యాంకును ఎంచుకొని మాత్రమే Personal Loan తీసుకోవడం మేలు.
ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేట్లతో, తక్కువ డాక్యుమెంట్లతో ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్న నేపథ్యంలో వారు దీన్ని ప్రత్యేకంగా లబ్దిపొందవచ్చు. మీ ఆర్థిక అవసరాలకు తగిన Personal Loan ఎంపిక చేసుకొని, భవిష్యత్ ఆర్థిక ఒత్తిడి లేకుండా సులభంగా తిరిగి చెల్లించేలా ప్లాన్ చేసుకోండి.