Passion Plus: జీఎస్టీ మార్పుతో భారీగా త‌గ్గిన ప్యాష‌న్ ప్ల‌స్‌ ధర.. కొత్త ధ‌ర తెలిస్తే ఎగిరి గంతేస్తారు.

Published : Sep 27, 2025, 04:03 PM IST

Passion Plus: కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని వ‌స్తువుల‌పై భారీగా ప‌న్ను త‌గ్గింది. మ‌రి జీఎస్టీ 2.0తో ప్యాష‌న్ ప్ల‌స్ బైక్‌పై ఎంత ధ‌ర త‌గ్గిందో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
త‌గ్గిన ప్యాష‌న్ ప్ల‌స్ బైక్ ధ‌ర‌

జీఎస్టీ త‌గ్గింపుత త‌ర్వాత హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ధర తగ్గింది. ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 83,190 నుంచి రూ. 76,691కు తగ్గింది. మీడియం రేంజ్ బ‌డ్జెట్‌లో అన్ని ఫీచ‌ర్ల‌తో ఉండే ఈ బైక్‌ను ముందు నుంచే మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా ధ‌ర త‌గ్గ‌డంతో దీనికి మ‌రింత డిమాండ్ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

25
ఇంజిన్, మైలేజ్ వివరాలు

హీరో ప్యాషన్ ప్లస్ 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7.91 bhp పవర్‌, 8.05 Nm టార్క్ ఇస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 85 kmph గరిష్ట వేగం అందుకోగ‌ల‌దు. 70 kmpl మైలేజ్‌తో ఒక ఫుల్ ట్యాంక్ (11 లీటర్లు)పై దాదాపు 750 km ప్రయాణించ‌వ‌చ్చు.

35
ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు

రోజువారీ ప్రయాణికుల కోసం ఈ బైక్‌లో అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందించారు. i3S టెక్నాలజీ, సెమీ-డిజిటల్ మీటర్‌, ట్రిప్ మీటర్‌, ఇంధన గేజ్‌, USB ఛార్జింగ్ పోర్ట్‌, సైడ్‌స్టాండ్ ఇంజిన్ కట్‌ఆఫ్ వంటివి ఇందులో ఉన్నాయి.

45
భద్రతా సదుపాయాలు

హీరో ప్యాషన్ ప్లస్‌లో ముందు-వెనుక 130 mm డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. ఇవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ (IBS)తో వస్తాయి. ఈ సిస్టమ్ బైక్ ఆపేటప్పుడు మరింత సురక్షితంగా పనిచేస్తుంది.

55
ఏ కంపెనీల‌కు పోటీనిస్తుందంటే.?

ఈ బైక్ ప్రధానంగా హోండా షైన్ 100, TVS Radeon, Bajaj Platina వంటి 100cc కమ్యూటర్ బైక్‌లతో పోటీపడుతోంది. ఇంధన సామర్థ్యం, సౌకర్యవంతమైన రైడ్‌, తక్కువ ధర వల్ల ఇది మధ్యతరగతి వినియోగదారులకి మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories