IRCTC Rules: అక్టోబర్ 1 నుండి ఐఆర్‌సిటిసి రూల్స్ మార్చింది, రైలు టికెట్ బుక్ చేసుకునే ముందు తెలుసుకోండి

Published : Sep 27, 2025, 12:14 PM IST

ఐఆర్‌సిటిసి (IRCTC) అతిపెద్ద రైలు నెట్వర్క్. ప్రపంచంలోనే ఇది నాలుగవ అతిపెద్ద రైలు నెట్వర్క్ గా పేరు తెచ్చుకుంది. అయితే అక్టోబర్ 1 నుండి ఐఆర్సిటిసి రైలు టికెట్ బుకింగ్ నియమాలను మార్చింది. ఆధార్ లేకుండా జనరల్ టిక్కెట్ కూడా బుక్ చేయలేరు. 

PREV
15
ఐఆర్‌సిటీసీ రూల్స్ మార్చింది

భారతదేశంలో లక్షలాది మంది ప్రతిరోజూ ప్రయాణించేది రైళ్లలోనే. అందుకే ఐఆర్సిటిసి ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా నాలుగో స్థానంలో నిలిచింది. రైళ్లు ఎప్పుడూ జనాలతో నిండి కనిపిస్తాయి. తక్కువ దూరాలు ప్రయాణించేటప్పుడు టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు మాత్రం ఖచ్చితంగా టికెట్లను బుక్ చేసుకోవాలి. లేకుంటే ప్రయాణం చాలా కష్టంగా మారిపోతుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఐఆర్సిటిసి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే వస్తోంది. టికెట్ విషయంలో జరిగే మోసాలను నివారించడానికి కూడా ప్రయత్నిస్తుంది. కొత్తగా ఇప్పుడు అక్టోబర్ 1 నుండి ఐఆర్‌సిటిసి రైలు టికెట్ బుకింగ్ నియమాలను మార్చింది. ఈ కొత్త నిబంధనల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

25
జనరల్ టిక్కెట్ బుక్ చేయాలంటే

భారతీయ రైల్వేలలో అక్టోబర్ 1, 2025 నుండి టికెట్ బుకింగ్ నియమాలు మారిపోయాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఐఆర్సిటిసిలో జనరల్ టికెట్ల ఆన్లైన్ బుకింగ్ లో పెద్ద మార్పు జరిగింది. అక్టోబర్ 1 నుండి టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కచ్చితంగా ఉండాలి. జనరల్ టికెట్ బుక్ చేసుకునేవారు ఇంతవరకు ఆధార్ కార్డు అవసరం లేకుండానే ఆ సదుపాయాన్ని పొందారు. కానీ ఇకపై ఆధార్ కార్డు లేకుండా మీరు జనరల్ టికెట్లను కూడా బుక్ చేసుకోలేరు. మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్ నుండి టికెట్లు బుక్ చేసుకున్నా లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో జనరల్ టికెట్లను బుక్ చేసుకున్న కూడా ఆధార్ కచ్చితంగా ఉండాలి. ఇప్పటికే స్లీపర్, ఏసీ టికెట్ల వరకు ఆధార్ తప్పనిసరిగా మారింది. జనరల్ టికెట్లకు మాత్రం ఆధార్ కార్డు నెంబర్ ను టికెట్ బుకింగ్ సమయంలో అడగడం లేదు.. కానీ ఇకపై ఆధార కార్డు ధృవీకరణ కూడా చాలా ముఖ్యం.

35
ఆధార్ తో లింక్ చేయండి

మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్లోకి వెళ్లి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తో టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు అందులో ఆధార్ కార్డు వివరాలను కూడా పొందుపరచండి. లేకుంటే ఇకపై జనరల్ టికెట్లను కూడా మీరు బుక్ చేయలేరు. ఐఆర్‌సిటిసి ఐడీని ఆధార్ తో లింక్ చేసి ఉన్న వినియోగదారులు మాత్రమే ఇకపై ఆన్లైన్ టికెట్ బుకింగ్‌ను పొందగలరు.

45
ఇలా ఆధార్ తో లింక్ చేయండి

మీ ఐఆర్‌సిటీసీ ఖాతాను ఆధార్ తో లింక్ చేయడం చాలా సులువు. ఇందుకోసం మీరు ముందుగా మీ ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్లోకి లేదా మొబైల్ యా‌ప్‌లోకి లాగిన్ అవ్వండి. అందులో ‘మై అకౌంట్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ ‘ఆధార్ కేవైసీ’ని లింక్ చేసే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ను నమోదు చేయండి. తర్వాత ‘సెండ్ ఓటిపి’ బటన్ పై క్లిక్ చేయండి. మీ ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. దాన్ని వెబ్సైట్లో నమోదు చేయండి. తర్వాత సబ్మిట్ కొట్టండి. మీ ఐఆర్సిటిసి ఖాతా ఆధార్ తో లింక్ అయినట్టు మీ స్క్రీన్ పై మెసేజ్ కనిపిస్తుంది. అలా కనిపించాక మీరు జనరల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

55
ఎందుకు ఈ నియమాలు?

టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకే ఐఆర్సిటిసి ఈ చర్య తీసుకుంది. అలాగే టికెట్ బుకింగ్ విషయంలో బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ కూడా పెరిగిపోయింది. వాటిని అడ్డుకునేందుకు కూడా భారతీయ రైల్వేలో ఈ నియమాలను, నిబంధనలను మారుస్తూ వస్తున్నాయి. నిజమైన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు అందాలని, సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని భారతీయ రైల్వే భావిస్తోంది. మధ్యలో టికెట్లను బుక్ చేసే దళారీ వ్యవస్థను అడ్డుకోవాలన్నదే మార్పులకు అసలు కారణం. అయితే కౌంటర్లకు వెళ్లే టికెట్ బుకింగ్ చేసుకునే వారికి మాత్రం ఎటువంటి మార్పులు లేవు. వారు సాధారణంగా ఎప్పటిలాగే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories