Vande Bharat train: కొత్త వందే భారత్ రైలు వచ్చేస్తోంది, ఇది ఎక్కడ నుంచి మొదలై ఎక్కడికి వెళుతుందంటే..

Published : Sep 27, 2025, 03:07 PM IST

భారతీయ రైల్వేలో వందే భారత్ రైలు (Vande Bharat train) కొత్త ప్రభంజనం. దేశవ్యాప్తంగా వందే భారత్ సర్వీసులు మెల్లగా మొదలవుతున్నాయి. త్వరలో చెన్నై నుంచి రామేశ్వరానికి వందేభారత్ ప్రారంభం కానుంది. చెన్నైలో ఉన్న తెలుగు వారికి ఇది ఎంతో ఉపయోగకరం.

PREV
15
కొత్త వందే భారత్ సర్వీసు

వందే భారత్ రైలులో ప్రయాణం ఎంతో సులువుగా ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ దూరాలు చేరుకోవచ్చు. దేశ వ్యాప్తంగా చాలా తక్కువ వందే భారత్ రైలు సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో వందే భారత్ సర్వీసు మొదలవ్వబోతోంది. చెన్నై నుంచి  రామేశ్వరానికి ఈ సర్వీసు నడవబోతోంది. రామేశ్వరానికి రోజూ వేలాది మంది పర్యాటకులు వస్తారు. వారి కోసం ఈ సర్వీసు మొదలు పెట్టారు.  పాంబన్ వంతెన పనులు పూర్తవడంతో, చెన్నై నుంచి ఈ  రైలు నడిపేందుకు సిద్ధమయ్యారు.

25
పనులు పూర్తి

పాంబన్ వంతెన దగ్గర కొత్త రైలు మార్గంలో విద్యుదీకరణ పనులు చివరి దశకు చేరాయి. త్వరలోనే దీని మీద నుంచి వందే భారత్ రైలు మొదలవ్వబోతోంది. ప్రస్తుతం చెన్నై-రామేశ్వరం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 11-12 గంటల సమయం తీసుకుంటున్నాయి. అందే వందేభారత్ రైల్లో వెళితే రెండు మూడు గంటల సమయం సేవ్ అవుతుంది.

35
ఎన్ని గంటల ప్రయాణం?

చెన్నై నుంచి ఈ వందే భారత్ రైలు ప్రారంభం కాబోతోంది.  రాత్రికి తిరిగి చెన్నైకు చేరుకునేలా  దక్షిణ రైల్వే సర్వీసును ప్లాన్ చేస్తోంది. వందే భారత్ రైలు 665 కి.మీ. దూరాన్ని 8-9 గంటల్లో పూర్తి చేస్తుంది. దీని వల్ల ప్రయాణ సమయం 2-3 గంటలు తగ్గుతుంది. ఇది ఎంతో పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

45
ఏ సమయానికి?

వందే భారత్ రైలు చెన్నై నుంచి ఉదయం 5:50 గంటలకి బయలుదేరి మధ్యాహ్నం 2:30కి రామేశ్వరం చేరుకుంటుంది. తిరిగి అక్కడ్నించి మధ్యాహ్నం 3:30కి బయలుదేరి రాత్రి 11కి చెన్నై చేరుకుంటుంది.  ఇది అన్ని స్టేషన్లలోనూ ఆగదు. కొన్ని ప్రధాన స్టేషన్లలోనే ఆగుతుంది.

55
ధరలు ఇలా

చెన్నై నుంచి రామేశ్వరం వెళ్లే వందే భారత్ రైలు ధరలు కూడా సాధారణంగానే ఉన్నాయి.  ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,400, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.2,400గా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories