Gas Connections Cut: దేశ ప్రజలకు పెద్ద షాకిచ్చిన ప్రభుత్వం, వారందరికీ గ్యాస్ సిలిండర్లు త్వరలో కట్

Published : Mar 26, 2026, 12:19 PM IST

Gas Connections Cut: దేశంలో వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఇంతవరకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వాడుతున్న ప్రజలలో కొంతమందికి గ్యాస్ కనెక్షన్ కట్ చేసే ప్రమాదం ఉంది. 

PREV
13
PNG కనెక్షన్ తీసుకోవాలి

దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్దం ప్రభావం మన దేశంపై కూడా పడింది. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి గ్యాస్ సమస్యలు రాకుండా ఉండేందుకు కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్లు వాడుతున్న ప్రజలే ఎక్కువ. ఇకపై ఎవరి ఇంటికైతే పైపు ద్వారా వచ్చే PNG గ్యాస్ సదుపాయం ఉంటుందో అలాంటివారికి ఎల్పిజి సిలిండర్లు ఇవ్వడం ఆపేస్తారు. అంటే మీ ప్రాంతంలో పైప్ గ్యాస్ అందుబాటులో ఉంటే మూడు నెలల్లోపు తప్పనిసరిగా PNG కనెక్షన్ తీసుకోవాలి. లేదంటే ఎల్పిజి సరఫరాను నిలిపివేస్తారు. గ్యాస్ కంపెనీలు ముందుగా వినియోగదారులకు ఈ విషయాన్ని సమాచారాన్ని ఇస్తాయి. ఎస్ఎంఎస్, కాల్ లేదా మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని చెబుతారు. కొంత గడువు ఇచ్చి ఆ గడువులోగా పిఎన్జి ద్వారా గ్యాస్ ను పొందమని చెబుతారు. ఆ తర్వాత ఎల్పిజి సప్లై ను ఆపేస్తారు.

23
ఎందుకు ఈ నిర్ణయం?

కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గ్యాస్ కొరతే ప్రధాన కారణంగా మారింది. ఎందుకంటే మన దేశంలో ఎల్పిజి గ్యాస్‌లో ఎక్కువ భాగం విదేశాల నుంచే వస్తోంది. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వస్తోంది. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలోని పరిస్థితుల వల్ల సరఫరా చాలా వరకు తగ్గిపోతుంది. దేశంలో గ్యాస్ వినియోగాన్ని సరిచేయాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే ప్రభుత్వం పైపులు ఉన్న ప్రాంతాల్లో ఎల్పిజి వినియోగాన్ని తగ్గించాలని చూస్తోంది. ఇలా చేస్తే ఎంతో ఎన్నో ఎల్పీజీ సిలిండర్లను పొదుపు చేయవచ్చు. వాటిని గ్రామీణ ప్రాంతాలకు పంపవచ్చు. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్న వారు అధికంగానే ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల నగరాల్లో మార్పు వస్తుంది. కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలకు మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల నగర జీవితం గ్రామాల్లోని ప్రజల జీవితం సమతుల్యంగా ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

33
PNGనే బెస్ట్ ఆప్షన్

ఇక వినియోగదారులకు కోణంలో చూస్తే Png నిజానికి ఒక మంచి ఎంపిక. సిలిండర్ బుక్ చేసుకోవడం, డెలివరీ కోసం వేచి ఉండడం అంటే ఇబ్బందులు ఉండవు. గ్యాస్ నేరుగా పైపు ద్వారా ఇంటికి 24 గంటలు వస్తూనే ఉంటుంది. నచ్చినప్పుడు వాడుకోవచ్చు. భద్రత పరంగా కూడా ఇది చాలా మంచిది. ఖర్చు కూడా కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉండొచ్చు. కొత్త కనెక్షన్ తీసుకోవడానికి మొదట కాస్త ఎక్కువ ఖర్చు అయినా... తర్వాత మాత్రమే ఇది సౌకర్యవంతంగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ కొత్త నియమం వినియోగదారుల జీవన విధానంలో పెద్ద మార్పే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు PNG అందుబాటులో ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా దానికి మారిపోవడం మంచిది. లేకుంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఆగిపోయే ప్రమాదం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories