Today Gold Rate in Hyderabad: బంగారం ధరలు మళ్లీ ఎగబాకడం మొదలైంది. యుద్ధ పరిస్థితులు కాస్త శాంతించడంతో మార్కెట్ వేడెక్కింది. దీంతో రేట్లు పెరగడం స్టార్ట్ అయింది. ఈరోజు మార్కెట్లో ఎంత ధర ఉందంటే...
మార్కెట్లో మళ్లీ పసిడి ఊపందుకుంది. రెండ్రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన ధరలు...ఇప్పుడు పరుగులు పెడుతోంది. నిన్న రూ.2వేల వరకూ పెరిగింది. పోనీలే ధరలు తగ్గుతున్నాయని మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు సంబరపడితే ఒక్కసారిగా ఆశలు ఆవిరయ్యాయి. దీంతో పాటు కంగారు కూడా మొదలైంది. ధరలు ఈసారి ఏ స్థాయికి చేరతాయని ఆందోళన చెందుతున్నారు.
24
ముడిచమురు కష్టాలు, పెట్రోల్ పెంట
అటు ఇరాన్, ఇజ్రాయెల్ వార్, ఇటు ముడిచమురు కష్టాలు, పెట్రోల్ పెంట, అటు లాక్‍డౌన్ ప్రచారంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ క్షణం ఏ సమస్య వచ్చి పడుతుందో అని సతమవుతున్నారు. అంతర్జాతీయంగా గానీ, మార్కెట్ పరంగా గానీ..ఎక్కడ ఏం జరిగినా ఆ ఎఫెక్ట్ మధ్యతరగతి ప్రజలపై పడుతోంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
34
హైదరాబాద్‍లో పెరిగిన బంగారం
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్లపై 10 గ్రాములు 220 పెరిగి రూ.1,46,890కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. కేజీ సిల్వర్ రేటు 2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖ, ముంబై, బెంగళూరు, కలకత్తాలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి.
ధరలనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెన్నె, హైదరాబాద్ చూసుకుంటే రూ.2వేలకు పైగా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో మేలిమి పసిడి 10 గ్రాములకు రూ.1,47,040లో ఉంది.