Today Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలకు రెక్కలు..యుద్ధం ఎఫెక్ట్ తో ఆకాశాన్నింటిన పసిడి

Published : Apr 08, 2026, 11:03 AM IST

Today Gold Rate: పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ షాక్. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు పెద్ద షాకిచ్చాయి. దీంతో మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇక పసిడి రేటు మరోసారి రూ.లక్షా 50వేలు దాటేసింది. 

PREV
14
ఆకాశాన్నింటిన బంగారం ధరలు

4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. ఒక్కసారిగా మేలిమి బంగారంపై దాదాపు రూ.4వేలు పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం...ఇరాన్-అమెరికా యుద్ధం నిలిచిపోవడం.

24
యుద్ధం ముగిసినట్లేనా

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య గత 5 వారాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయాలు గందరగోళం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2 వారాల పాటు యుద్ధం జరగదని ప్రకటించారు. ఇరాన్ తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ జరిగినట్లు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. యుద్ధం ముగిసింది కాబట్టి...హర్మూజ్ జలసంధి తెరవనున్నట్లు తెలిపింది. చమురు సరఫరాకు కీలక మార్గమైన హర్మూజ్ మూసేయడంతో ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా భారత్ చాలా ఇబ్బంది పడింది. యుద్ధం ముగియడానికి పాక్ కూడా సహకరించింది.

34
బంగారం మరింత పెరిగే అవకాశం

ఇక యుద్ధం ముగియడం, జలసంధి తెరిచే అవకాశం రావడంతో....ఆయిల్ ఆధారిత దేశాలకు ఉపశమనం దొరికింది. ఇప్పటికే చమురు ధరలు తగ్గాయి. బ్యారెల్ చమురు 117 నుంచి 93 డాలర్లకు పడిపోయింది. యుద్ధం ముగియడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. యుద్ధం ముగియడంతో బంగారం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

44
24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.3,980 పెరుగుదల

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.3,980 పెరిగి రూ.1,53,820గా ఉంది. 22 క్యారెట్లపై 10 గ్రాములు రూ.3,650 పెరిగి రూ.1,41,000గా ఉంది. వెండి ధర కేజీ రూ.2,54,900గా ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.92.72పైసలుగాఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories