Business Idea: ఇప్పుడు ప్రతి చిన్న అకేషన్‌కు కేక్ కటింగ్ అనేది తప్పనిసరి అయింది. అయితే, ప్రతిసారీ 1kg లేదా అంతకంటే పెద్ద కేక్స్ అవసరం ఉండదు. ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తూ మినీ కేక్స్(200g - 250g) బిజినెస్ ప్రారంభించడం లాభదాయకం. ఆ వివరాలు..
వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండకుండా ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు "మినీ కేక్స్" ఒక అద్భుతమైన ఐడియా. ప్రస్తుతం బర్త్ డేలు మాత్రమే కాకుండా యానివర్సరీలు, ఫ్రెండ్స్ మీటప్‌లు, లాంగ్ డ్రైవ్స్ వంటి ప్రతి సందర్భంలోనూ కేక్ కటింగ్ సర్వసాధారణమైపోయింది. అయితే, పెద్ద కేకులు వృధా అవుతాయనుకునే వారికి ఈ మినీ కేక్స్(చిన్న సైజు కేకులు) ఒక చక్కని ప్రత్యామ్నాయం.
25
పెట్టుబడి, శిక్షణ:
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు 30,000 నుంచి 50,000 రూపాయల లోపు పెట్టుబడి సరిపోతుంది. ఇందులో ఒక మంచి క్వాలిటీ ఓవెన్ కొనుగోలుకు 15,000 వరకు, బేకింగ్ క్లాసులకు మరికొంత ఖర్చు అవుతుంది. ఒకట్రెండు వారాల శిక్షణతోనే రుచికరమైన కేకులను తయారు చేయడం నేర్చుకోవచ్చు. ఇంటి నుండే ఈ పని చేయవచ్చు కాబట్టి అదనంగా షాపు రెంట్ లేదా ఇతర ఖర్చులు ఉండవు.
35
వ్యాపార వ్యూహం:
మీ సిగ్నేచర్ రెసిపీతో క్రియేటివ్ డిజైన్లను రూపొందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు. కేవలం ఆర్డర్ల మీద మాత్రమే కాకుండా, స్థానిక బేకరీలతో టై-అప్ అయి వారికి మినీ కేకులను సరఫరా చేయవచ్చు.
స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా క్లౌడ్ కిచెన్‌గా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. షుగర్-లెస్ కేక్స్ లేదా హెల్తీ ఇంగ్రిడియంట్స్‌తో చేసే కేకులకు ఇప్పుడు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
55
ఆదాయం ఇలా..
ఒక మినీ కేక్ ధరను 150 నుండి 200 రూపాయల వరకు నిర్ణయించవచ్చు. మేకింగ్ ఖర్చులు పోను ఒక్కో కేక్ మీద కనీసం 150 రూపాయల లాభం ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. రోజుకు సగటున 10 కేకులు విక్రయించినా, నెలకు 35,000 నుండి 45,000 రూపాయల వరకు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ స్థలంలో ప్రారంభించగలిగే ఈ వ్యాపారం గృహిణులకు, విద్యార్థినులకు ఎంతో లాభదాయకం.